సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
సారథిన్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను మొగిపురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరేశ్, రవి పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని జెడ్ చెర్వు, బచ్చురాజ్ పల్లి, నందిగామ గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట లో మొగిపురుగు నివారణకు నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా క్లోరిఫైరిఫాస్ 2 ఎం ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]
సారథి న్యూస్, దేవరకద్ర: ఈ ఏడాది కాలం కలిసొచ్చిందనుకుంటే ముసురు వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు పత్తి పొలాల్లోకి విపరీతంగా నీరు వచ్చిచేరింది. దీంతో పంటంతా ఊట ఎక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేవరకద్ర మండలంలో ఈ ఏడాది సుమారు 11వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మండలంలోని గోపనపల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, రాజోలి, వెంకటగిరి, వెంకంపల్లి […]
సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్‌రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]
సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]
సారథిన్యూస్, నారాయణఖేడ్: మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజులు క్రితం రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. వర్షం రాకపోవడంతో నిరాశలో ఉన్న రైతులకు ప్రస్తుతం కురిసిన వర్షంతో ఆశలు చిగురించాయి. పత్తి, కందులు, పేసర్లు, మినుములు, సొయా వంటి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను కొనడం లేదని మంగళవారం కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామరైతులు స్థానిక అగ్రికల్చర్ ఆఫీసు ఎదుట ధర్నాచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని గొప్పలు చెప్పి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి చివరకు చేతికి వచ్చేసరికి కొనడం లేదన్నారు. అనంతరం మార్కెటింగ్‌శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి, మారుతిరెడ్డి, సంజీవ్, గోపాల్ పాల్గొన్నారు.