Breaking News

నిర్వాసితులు

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

సారథి న్యూస్​, పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన పాలకుర్తి మండలం వెంనూర్​లో ఎల్లంపల్లి రిజర్వాయర్​ కోసం భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, పాలకుర్తి తహసీల్దార్​ రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.

Read More

రైతులను ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా నారాయణపుర్ రిజర్వాయర్ ను బుధవారం టీడీపీ బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ.. నారాయణపూర్​ రిజర్వాయర్ నింపి రైతులను ఆదుకోవాలని.. భూములు , ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జంగం అంజయ్య, నేతలు కరుణాకర్​రెడ్డి, జెల్లోజి శ్రీనివాస్​, పూరెల్ల గంగరాజుగౌడ్​, అనుపురం వెంకటేశ్​గౌడ్​, భూపతి తదితరులు పాల్గొన్నారు.

Read More

కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం

సారథి న్యూస్, రామాయంపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్​​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అధికారులు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని నార్లాపూర్​ గ్రామంలో 178 మంది కొండపోచమ్మ రిజర్వాయర్​లో భూములు కోల్పోయారు. వీరికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం చెక్కులను పంపిణీ చేశారు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. […]

Read More

‘గౌరవెల్లి’ పనుల వేగం పెంచండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్​రావు ఇరిగేషన్​ అధికారులకు సూచించారు. శనివారం అరణ్య భవన్ లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ కుమార్ తో కలిసి సమీక్షించారు. రిజర్వాయర్ పాత కొత్త పనుల కోసం రూ.583.2 77 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.493.91 […]

Read More

నెలరోజుల్లో నీళ్లిస్తే గుండు గీసుకుంటం

బీజేపీ నేత విజయ పాల్ రెడ్డి సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నీళ్లు తీసుకొస్తే గుండు గీసుకుంటామని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయ పాల్ రెడ్డి సవాల్​ విసిరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిచేయకుండా ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సమావేశంలో అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, శంకర్ […]

Read More