Breaking News

నిజాంపేట

రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట క్లస్టర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు అందె ప్రతాప్ రెడ్డి రూ.12లక్షల చెక్కును డీడీఏవో పరుశురాం నాయక్ కు అందజేశారు. మండల రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాం, ఏవో సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
భక్తిశ్రద్ధలతో దుర్గమాత ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో దుర్గామాత ఉత్సవాలు

సారథి న్యూస్​, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో ఆదివారం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పురోహితులు వేలేటి లక్ష్మణశాస్త్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో దుర్గామాత కమిటీ సభ్యులంతా భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు కట్టుకుని అమ్మవారి సేవకు అంకితమయ్యారని తెలిపారు. గ్రామస్తుంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.

Read More
కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్​పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించినా నయం కాకపోవడం, అలాగే తన కుటుంబసభ్యులు తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉంటూనే ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని […]

Read More
చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
విమోచనంపై సీఎం మాట తప్పిన్రు

విమోచనంపై సీఎం మాట తప్పిన్రు

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని, ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు రోజులు దగ్గరపడ్డాయని మెదక్​ జిల్లా నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం నిజాంపేట మండలకేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన […]

Read More
ఉదారత చాటిన స్నేహబంధం

ఉదారత చాటిన స్నేహబంధం

సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. […]

Read More
నీళ్ల కష్టాలు తీరుస్తాం

నీళ్ల కష్టాలు తప్పవు

సారథి న్యూస్​, నిజాంపేట: ప్రజలకు కొంతకాలం నీళ్ల కష్టాలు తప్పవని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. సింగూర్​ జలాశయానికి నీళ్లు వస్తే ప్రజలకు నీళ్లకష్టాలు పోతాయని చెప్పారు. మంగళవారం ఆమె మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నీటికష్టాలు ఉండరాదని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​, తహసీల్దార్​ […]

Read More

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

సారథి న్యూస్​, రామాయంపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ నిజాంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రంగ పోచయ్య(63) రెండు రోజుల క్రితం మామిడి పండ్లు తెంచే క్రమంలో చెట్టు పైనుంచి కాలుజారి కింద పడి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. చల్మేడ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు(36) గత బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సపొందుతూ పరిస్థితి […]

Read More