Breaking News

టీఆర్ఎస్

సంతోష్‌ నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

సంతోష్‌నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: నగరంలోని సంతోష్‌ నగర్‌ ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్​ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌ వే మార్గంగా […]

Read More
12 మంది ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభలో 12 ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ తొలిరోజే సాగుచట్టాల రద్దు వ్యవహారం ముగిసింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి […]

Read More
రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేకే గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్​ఎంపీల నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద […]

Read More
సామాజిక దార్శనికుడు మహాత్మా పూలే

సామాజిక దార్శనికుడు మహాత్మా పూలే

 సామాజిక సారథి,హాలియా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే నోముల భగత్  అన్నారు. పూలే 131వ వర్థంతి సందర్భంగా హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో అనుముల మండల అధ్యక్షుడు […]

Read More
భిక్షమెత్తి గురుకులాలను నడిపించా..

గురుకులాల కోసం భిక్షమెత్తాల్సి వచ్చేది..!

సామాజిక సారథి, హైదరాబాద్ ​ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలను నడిపించేందుకు ప్రభుత్వం సరైన బడ్జెట్ ​ఇవ్వలేదు.. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ వద్ద భిక్ష అడగాల్సి వచ్చేదని గురుకులాల పూర్వ కార్యదర్శి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ గుర్తుచేసుకున్నారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక్కోరూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెడుతూ పేదవర్గాల బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించగలిగామని వివరించారు. టీఆర్ఎస్ ​నాయకులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురుకులాలకు ఏదో చేశామని, అహో, […]

Read More
ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు

సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు  తెలిపారు.

Read More
సారు.. సర్కారుకు షాక్!

సారు.. సర్కారుకు షాక్!

అటు విమ‌ర్శలు.. ఇటు రాజీనామాలు ఢిల్లీలో రైతులకు ప్రకటించిన సాయం తిరస్కరణ టీఆర్ఎస్​కు త‌ల‌బొప్పి కట్టిన తాజా పరిణామాలు బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ టికాయత్​విమర్శలు క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ రవీందర్ సింగ్, సీనియర్​నేత గట్టు రామ‌చందర్​రావు రాజీనామా ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదని లేఖలు సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: కారు.. సారుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఏడాదిగా కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతన్నల […]

Read More
పెద్దల సభకు ఎవరు?

పెద్దల సభకు ఎవరు?

జాతీయస్థాయిలో పనిచేసే వారికే చాన్స్​ బండా ప్రకాశ్​ రాజ్యసభ సీటు ఖాళీ ఎమ్మెల్సీ కవిత వెళ్తారని ప్రచారం రాష్ట్ర రాజకీయాల వైపే ఆమె మొగ్గు జూన్​లోమరో రెండు స్థానాలు ఖాళీ రేసులో వినోద్​కుమార్, మోత్కుపల్లి, మండవ, తుమ్మల తెలంగాణ నుంచి ఖాళీకానున్న రాజ్యసభ రేసులో ఎవరున్నారు. పెద్దల సభలో అడగుపెట్టాలని ఊవ్విళ్లూరుతున్న నేతలెవరు.. ఆశావాహుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా గులాబీ దళపతి ఎవరికి అవకాశమిస్తారనే చర్చ టీఆర్ఎస్​లో జోరుగా సాగుతోంది. ఈ అంశమే హాట్ టాపిక్ […]

Read More