కాంగ్రెస్ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంట్ తొలిరోజే సాగుచట్టాల రద్దు వ్యవహారం ముగిసింది. ఇక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి […]