సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పిలుపులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఒక్కో అంబులెన్స్ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. శనివారం మూడు అంబులెన్స్ వాహనాలను మంత్రి కె.తారక రామారావు ప్రగతిభవన్లో ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్యే […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రూ.8.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐబీ కార్యాలయం […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కె.తారక రామారావు నమోదు చేసుకున్నారు. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును కచ్చితంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]
సారథి న్యూస్, రామడుగు: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలంటే సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని రామడుగు ఎంపీపీ కె.కవిత సూచించారు. మంగళవారం రామడుగు మండలం శనగర్ లో ఆత్మ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, పత్తిలో చీడపీడల నివారణపై పలువరు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, జడ్ఆర్ఎస్ఎస్ మెంబర్ గర్రెపల్లి కర్ణాకర్, వీడీసీ చైర్మన్ కర్ణాకర్, ఉపసర్పంచ్ వెంకట్ నర్సయ్య, ఆత్మ […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం.. చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లపేరుతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోవడం, మీకు చూపించలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ […]