సారథి న్యూస్, రామడుగు: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో విఫలమైన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గద్దె దిగాలని కరీంనగర్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిశేఖర్ విమర్శించారు. ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు అన్న మోడీ, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ మాట […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో డిమాండ్ లేవనెత్తారు. కాంగ్రెస్ లీడర్లతో ఫ్యామిలీకి సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కాగా, చాలామంది సీనియర్ లీడర్లు ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా దీనిపై స్పందించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఇంకా యాక్టివ్‌గా ఉండాలని, ఆయన ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని కోరారు. […]
న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేయాలని మా లాయర్‌ను కోరాను. హైకోర్టు […]
జైపూర్: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓ దశలో అధిష్ఠానం హామీతో సచిన్ పైలట్ మెత్తబడ్డాడని వార్తలు వినిపించాయి. అంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. తాను హైకమాండ్‌తో మాట్లాడలేదని.. తనకు ఎవరూ ఎటువంటి హామీలు ఇయ్యలేదని ఆయనే స్వయంగా చెప్పారు. సోమవారం ఉదయం తనవర్గ ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. తాజాగా జైపూర్‌లోని ఫెయిర్‌మోంట్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనాసభా […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ సమరయోధుడు గులాం రసూల్ ఖాన్180వ వర్ధంతిని ఆదివారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ్మయాదవ్ మాట్లాడుతూ.. సిపాయిల తిరుగుబాటుకు పూర్వమే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయన్నారు. 1801లో పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో తెర్నేకల్ గ్రామస్తులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారని గుర్తుచేశారు. కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్ […]
సారథి న్యూస్, బెజ్జంకి: రహదారులపై కల్వర్టులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువజన కాంగ్రెస్ నేత పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తాళ్లపల్లి, గూడెం, వడ్లూర్, బేగంపేట్, లక్ష్మీపూర్, ఎల్లంపల్లి, తలారివానిపల్లి గ్రామాలకు వెళ్లేదారుల్లో కల్వర్టులు లేక రాత్రివేళల్లో ప్రజలు అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: గాంధీ ఫ్యామిలీకి చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం గవర్నమెంట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌కు చెందిన ఫారెన్ డొనేషన్స్, ఇన్‌కమ్‌ట్యాక్స్ వయలేషన్లపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇంటర్ మినిస్ట్రల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్ ట్యాక్స్, ఫారెన్ […]
న్యూఢిల్లీ: అనేక విషయాల్లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ మూడు అంశాల్లో ఫెయిల్ అయ్యారని, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టడీలో ఈ విషయం తేలిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఫ్యూచర్ హెచ్‌బీఎస్ స్టడీస్ ఆన్ ఫెయిల్యూర్: 1. కొవిడ్ 19, 2,డీమానిటైజేషన్, 3. జీఎస్‌టీ అమలు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దాంతో పాటు మోడీ కరోనాపై మాట్లాడుతున్న […]