టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికలో రేసులో అంతా అనుకున్నట్లే కారే గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక అనంతరం మహిళా సమాఖ్య భవన్ లో మంగళవారం కౌంటింగ్ ఉదయం నిర్వహించారు. ఏడుగురు అభ్యర్థు పోటీ పడిన ఈ ఎన్నికల్లో 1271 ఓట్లుకుగాను, 1233 ఓట్లు పోలయ్యాయి. కాగా, కౌంటింగ్ లో ఎంసీ కోటిరెడ్డికి […]
రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) […]
ఆత్మగౌరవం కోసమే ఎమ్మెల్సీగా పోటీ టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసే కుట్ర చేస్తోందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఆరోపించారు. నల్లగొండలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు […]
సామాజిక సారథి, కల్వకుర్తి: రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీని కశిరెడ్డి. నారాయణరెడ్డి ని హైదరాబాద్ లోని తమ నివాసంలో మాడ్గుల, వెల్దండ,తలకొండపల్లి, కల్వకుర్తి మండలాల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ గా రెండో సారి ఎన్నికైన సంధర్భంగా పుష్పగుఛ్ఛం, శాలువాలతో సత్కరించారు. తదుపరి ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా కడ్తాల మండలం ముద్విన్, చరికొండ గ్రామ పంచాయతీకి చెందిన లబ్దిదారులకు CM సహాయ నిధి చెక్కులను బాధితునకు అందించారు.
సామాజిక సారథి, చారకొండ: రెండోసారి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలకు హైదరాబాద్లోని వారి వారి నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, చంద్రాయన పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి వారికి పుచ్ఛగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కడారి మల్లయ్య, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని […]
సామాజిక సారథి, మహబూబాబాద్: తక్కలపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన అనుచరులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనుచరుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ మానుకోట ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రవీందర్ రావు ఎమ్మెల్సీ పదవి రావడం సంతోషకరమన్నారు. రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవొస్తే అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారికి 101కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకుంటామని మొక్కినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. […]
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ తీసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ కేడర్‌లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]