సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]
సారథి న్యూస్, మెదక్: ఆసక్తి ఉండి అడిగినవారు అందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ సైదులు స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీల డిమాండ్ మేరకు పనులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి రిజిస్టర్లు, వర్క్ ఫైళ్లు, వర్క్ […]
సారథి న్యూస్, రామాయంపేట: సబ్బండవర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి గ్రామంలో వందశాతం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో గురువారం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కలసి చేపపిల్లలను చెరువులో వదిలారు. సోమాజి చెరువులో 73,500 చేపపిల్లలు, బ్రాహ్మండ్ల చెరువులో 93వేల చేప పిల్లలను వదిలినట్లు […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సరిగ్గా అమలుకావడం లేదని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాష్ట్ర కన్వీనర్ పి.శంకర్ అన్నారు. ప్రత్యేకాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారోద్యమ కరపత్రాలను మంగళవారం నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో బుధవారం 43 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ ఎలిజిబెత్ రాణి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పాజిటివ్వచ్చినవారు అధైర్యపడొద్దని సూచించారు. మెడికల్ టెస్టులు నిర్వహించిన వారిలో ఏఎన్ఎం రేణుక, ఆశావర్కర్లు సంతోష, రేఖ, పుష్ప, మమత […]
సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో దళితులను ముదిరాజ్ కులస్తులు బహిష్కరించానే ఫిర్యాదులపై మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. పంచాయతీ ఆఫీసు వద్ద గ్రామస్తులు అందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రవి, పెద్దశంకరంపేట ఎస్సై సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ చరణ్ సింగ్, అరె ప్రభాకర్, సర్పంచ్ సరిత మల్లేశం పాల్గొన్నారు.