Breaking News

రామడుగు

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్​ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ​గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం […]

Read More
ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కుమార్

ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కుమార్

సారథి, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో శ్రీరామాంజనేయ ఆటో యూనియన్ ను బుధవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెసరి కనకరాజు ఎన్నిక కాగా, అధ్యక్షుడిగా రెండవ సారి ఉత్తెం కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఉత్తేం దేవరాజు, కోశాధికారిగా చంటిబాబు, రైటర్ గా అనుపురం మల్లేశం, సలహాదారుగా కర్నె శ్రీను, పంజాల శ్రీనివాస్, కార్యవర్గసభ్యులుగా ఉత్తెం మల్లేశం, ఉత్తెం సాగర్, గాదం మహేష్, మామిడి రాజు, బుత్కురి […]

Read More
భారతమాత చిత్రపటం బహూకరణ

భారతమాత చిత్రపటం బహూకరణ

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం వెలిచాల పంచాయతీకి సోమవారం బీజేపీ నాయకులు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజ, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, బీజేపీ నాయకులు కట్ట రవీందర్, ముడుగంటి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

Read More
బీజేపీ కార్యవర్గ సమావేశం

బీజేపీ కార్యవర్గ సమావేశం

సారథి, రామడుగు: మండల కేంద్రంలోని స్థానిక ఆర్య వైశ్య భవనంలో బీజేపీ రామడుగు మండల శాఖ కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పార్టీ సంస్థగత నిర్మాణంపై చర్చించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ఇన్​చార్జ్ రాపర్తి ప్రసాద్, కృష్టారెడ్డి, జిన్నారం విద్యాసాగర్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read More
సర్పంచ్ ఔదార్యం

సర్పంచ్ ఔదార్యం

సారథి, రామడుగు: ఆపదలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి పట్ల సర్పంచ్ ఔదార్యం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు రేణిగుంట రాజమల్లయ్య శనివారం అనారోగ్యానికి గురైయ్యాడు. ఆయనను వెంటనే కరీంనగర్ ​సిటీ దవాఖానకు తరలించగా ట్రీట్​మెంట్​ పొందుతున్నాడు. గోపాల్​రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న వెంకట్రామిరెడ్డి శనివారం రాజమల్లయ్యను పరామర్శించి రూ.15వేలు అందజేశారు. వైద్యచికిత్సల కోసం అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Read More
ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్​

ప్రగతిభవన్ ముట్టడి.. బీజేవైఎం నేతల అరెస్ట్​

సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్​చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్​అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర […]

Read More
త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. పెండింగ్​లో ఉన్న రేషన్ కార్డులను విడతల వారీగా ఇస్తామని, రానున్న రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుంకే […]

Read More
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

సారథి, రామడుగు: పెగసెస్ స్ర్పైవేర్ ​యాప్ తో కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడికి తరలివెళ్తున్న రామడుగు మండల కాంగ్రెస్ నాయకులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బొమ్మరవేని తిరుపతి, జిల్లా కాంగ్రెస్ […]

Read More