Breaking News

Day: July 28, 2021

రాజన్నసన్నిధిలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

రాజన్నసన్నిధిలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏకైక కైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి లడ్డూప్రసాదం అందజేసి సత్కరించారు.

Read More
కండరగండడు

కండరగండడు

సారథి, మానవపాడు: 50 కాదు.. 100 కాదు.. 150 కేజీలకు పైగా ఉన్న బరువును ఈజీగా ఎత్తేశాడు ఈ కండరగండడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇమ్రాన్​ మాసుం బాషా గుండ్లను ఎత్తే ప్రదర్శనలో ఎప్పటినుంచో పాల్గొంటున్నాడు. ఇటీవల బక్రీద్​పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా గుత్తి పెట్రోల్​బంక్​వద్ద సీఐటీయూ ఆటోడ్రైవర్ల యూనియన్​ఆధ్వర్యంలో గుండ్లను ఎత్తే పోటీలో పాల్గొన్నాడు. 140, 160 కిలోల బరువైన గుండ్లను ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటోడ్రైవర్లు మాసుం బాషాకు అభినందనలు తెలిపి సన్మానించారు. […]

Read More
పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్​కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్​ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో […]

Read More
ఆ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది..

ఆ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి అందుతుంది..

నేటి రాశిఫలాలుతేదీ: 28.07.2021బుధవారం1.మేషంకొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాల్​గా మారే సూచనలు ఉన్నాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. అనుకోని ఖర్చులు ఇతరాత్ర సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో […]

Read More
త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. పెండింగ్​లో ఉన్న రేషన్ కార్డులను విడతల వారీగా ఇస్తామని, రానున్న రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుంకే […]

Read More
కొవిడ్​ఉందనే రాలేకపోయా..

కొవిడ్​ ఉందనే రాలేకపోయా..

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇటీవల జర్మనీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మొదటిసారి బుధవారం వేములవాడ రెండవ బైపాస్ రోడ్డులోని గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ప్రజలకు దూరంగా ఉంటారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబసభ్యులతో జర్మనీలోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. […]

Read More
పూసల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

పూసల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం వేములవాడ కమాన్ చౌరస్తాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముద్రకోల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముద్రకోల వెంకటేశం, కోశాధికారిగా ముద్రకోల గణేశ్​నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 17 గ్రామాలకు చెందిన 70 మంది పూసల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Read More
పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పునాది తవ్వితే.. బంగారమే బంగారం!

పనులు చేస్తుండగా కూలీలకు లభ్యం ఒకేచోట 100కు పైగా నాణేలు వెలుగులోకి.. వాటి విలువ రూ.కోటిపైమాటే సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో శివాలయం పక్కన జనార్ధన్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లును కడుతుండగా, పునాదుల్లో బంగారు ఆభరణాలు, నాణేలు లభించాయి. అసలు విషయం ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలు తలా పంచుకున్నారు. అసలు విషయం బుధవారం వెలుగుచూసింది. పునాదులు తవ్వడానికి 10 మంది కూలీలు పనిచేశారు. అందులో […]

Read More