సారథి న్యూస్, మెదక్: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గేలా చూడాలని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి కలెక్టర్ఎం.ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ఎప్పడికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తం ఉండేలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, ఈవోఎంహెచ్ఎన్ సుమిత్రారాణి, అదనపు జిల్లా వైద్యాధికారి రాజు, జిల్లా సర్వేలైన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్కాజి […]
సారథి న్యూస్, రామయంపేట: ప్రతి గ్రామంలో రైతులు వేసిన పంటలను నమోదు చేయించుకోవాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. శనివారం మండలంలోని నందిగామ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. పంట గణన ప్రక్రియ పక్కాగా ఉండాలన్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఎప్పకప్పుడు ఆన్లైన్లో అప్‌లోడ్‌చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంపత్, రాజగోపాల్ ఉన్నారు.
సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
సారథి న్యూస్, మెదక్: రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఆటోనగర్ లో ఉన్న వీరభద్ర, కేదారీశ్వరి ట్రేడింగ్ కంపెనీ ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ –పాస్ మిషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని అసలు దానిని వినియోగిస్తున్నారా ? లేదా ? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ–పాస్ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనంలోనే పెళ్లిచేస్తే వారి మానసికస్థితి ఎదగకపోవడంతో సమస్యలు వస్తాయని కలెక్టర్ వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా మెదక్ జిల్లాలో సఖి సెంటర్‌ను నిర్వహించనున్నట్లు […]
సారథి న్యూస్, మెదక్: అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బ్యాంకులు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. చేనేత వృత్తులు, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుందని ఆయన సూచించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం అనంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల మంజూరుతో పాటు […]
సారథిన్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రంతోపాటు మండలపరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాలలో డంప్ యార్డ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇందిరా, జెడ్పీటీసీ విజయ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రామాయంపేట మున్సిపల్ […]
సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నేషనల్ హైవేల వెంట మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎన్ హెచ్ -9, ఎన్ హెచ్- 44 రూట్లలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మల్కాపూర్ బ్రిడ్జి వద్ద సైడ్ డ్రెయిన్లు పూర్తిచేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ […]