Breaking News

మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]

Read More
బావిలోకి దూసుకెళ్లిన కారు

బావిలోకి దూసుకెళ్లిన కారు

తల్లీకొడుకు మృత్యువాత సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి సామాజిక సారథి, దుబ్బాక: కారు వేగం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు బుధవారం మృతిచెంచాడు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు లక్ష్మి(50), ప్రశాంత్ (26) కారులో |హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో […]

Read More
సాహితి లెజెండ్ "సిరివెన్నెల" ఇకలేరు

సాహితి లెజెండ్ “సిరివెన్నెల” ఇకలేరు

సామాజిక సారథి, హైదరాబాద్:  సరస్వతీ పుత్రుడు, సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరన్న వార్త, సినీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. ఆయన పాటే శ్వాసగా జీవిస్తూ వెండితెరమీద సిరివెన్నెల కురిపించిన మహానుభావుడు. మాట, పాటల మాంత్రికుడు వేలాది పాటలు రాసి జన హృదయాలను దోచుకున్న ప్రజాకవి అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతి సాహితి, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సినీ ప్రముఖులు, నటులు, తారలు, ఆర్టిస్టులు, కుటుంబానికి ప్రగాఢ […]

Read More
డాలర్‌ శేషాద్రి కన్నుమూత

డాలర్‌ శేషాద్రి కన్నుమూత

కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్​ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్​ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]

Read More
సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సామాజిక సారథి, హైదరాబాద్‌: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా […]

Read More

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

కరోనాతో హాస్యనటుడు మృతి

తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్​.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్​ […]

Read More

రియాకు పెరుగుతున్న మద్దతు

సుశాంత్​ రాజ్​పుత్​ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతు పెరుగుతున్నది. సుశాంత్​ ఘటన అనంతరం వెల్లువెత్తిన ఆరోపణలతో రియా చక్రవర్తి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు సమాచారం. తొలుత ఆమె వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో నెట్​జన్లు ఆమెపై ట్రోలింగ్​ మెదలుపెట్టారు. దీనికి తోడు జాతీయమీడియా సైతం రియాపై అనేక కథనాలు వెలువరించింది. సుశాంత్​ అభిమానులు ఇప్పటికీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు రియాకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల […]

Read More