సారథి, ములుగు: ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తాము పండించిన పంటను అమ్మడంలో ఇబ్బందిపడకూడదని ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్వోఎఫ్ఆర్ లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ములుగు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి వివరించగా.. వారి కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19ను అరికట్టేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని సైంటిస్టులు తనకు వివరించారని ప్రధాని మోడీ ట్వీట్‌చేశారు. అంతకుముందు మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. […]
రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వారంలో మొదటి రెండ్రోజుల్లో 80వేల లోపు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధవారం నుంచి మళ్లీ 95వేలు దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్‌లో సుమారు రెండు లక్షల (1,93,134) మంది మహమ్మారి బారిన పడ్డారు. […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో కొంత భాగాన్ని కోవిడ్ –19 ఆస్పత్రిగా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఐదొందల పడకల సామర్థ్యంతో కోవిడ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. రోజుకు రెండువేల వైద్యపరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు. పరీక్షలకు ముందుకు వచ్చే వారికి టోకెన్ జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.చెంచయ్య, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర్‌రావు, ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్–19) ప్రజలను వణికిస్తోంది. ఇంకా మెడిసన్ నోచుకుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గర్భిణులకు ఈ వ్యాధి సోకితే ఏం చేయాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో జరిగిన వైద్యుల సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య వివరించారు.ఆ ఆలోచనే వద్దు..అతి భయంకరమైన ఈ కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఒకవేళ ఈ […]
సారథి న్యూస్, హైదరాబాద్ : కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది. పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్యసేవలు, వసతులు అందుబాటులోని శానిటేషన్స్, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లోని బెడ్స్, ఐసీయూలో బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న […]