Breaking News

కరోనా.. గర్భిణుల జాగ్రత్తలివే

ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్–19) ప్రజలను వణికిస్తోంది. ఇంకా మెడిసన్ నోచుకుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గర్భిణులకు ఈ వ్యాధి సోకితే ఏం చేయాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్​లో జరిగిన వైద్యుల సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య వివరించారు.
ఆ ఆలోచనే వద్దు..
అతి భయంకరమైన ఈ కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఒకవేళ ఈ వ్యాధికి మందు కనుగొన్నా కూడా కొంతకాలం పాటు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. అందుకోసం కొత్తగా పెళ్లయిన వారు లేదా ఈ ఏడాది పిల్లల గురించి ప్లాన్ చేసుకునే వాళ్లు కొంతకాలం ఆగితేనే మంచిది. ఏడాది కాలం టైమ్ తీసుకుంటే ఇంకా మంచిది. వీక్ పర్సనాలిటీ ఉండేవారు, ఆరోగ్యం సరిగా లేనివారు ప్రస్తుతానికి అసలు పిల్లల ఆలోచన చేయకపోవడం ఇంకా మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి తల్లి నుంచి పిల్లకు సంక్రమించే అవకాశం ఉంది. కాన్పు కష్టం కావొచ్చు, పిల్లలకు అంగవైకల్యం కలగవచ్చు. ఎందుకంటే వ్యాధి సోకిన తర్వాత కూడా దాని ప్రభావం కొంతకాలం వారి హెల్త్​పై ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన మానుకుంటేనే మంచిది.

డాక్టర్ కావ్య, గైనకాలజిస్ట్


తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఒకవేళ ఇప్పటికే ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినవాళ్లు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు బయటకు రాకుండా ఇంట్లోనే క్వారంటైన్​ పాటిస్తే మంచిది. వ్యాధి లేకపోయినా ఇంట్లోని సభ్యులకు దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్​ సలహాలు తీసుకుంటూ ఉండాలి. పౌష్టికాహారాన్నే తీసుకుంటూ.. పరిశుభ్రతతో పాటు ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలి. డాక్టరు సలహాపై ఇంట్లోనే వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే తగినంత శ్రమ లేకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి. మంచినీళ్లు బాగా తాగాలి. నీళ్ల ద్వారా వైరస్ త్వరగా డైల్యూట్ అయ్యే చాన్స్​ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫాం అయిన వారు దగ్గు, జలుబు, తుమ్ములతో కాని ఇబ్బంది పడుతుంటే తప్పకుండా కరోనాకి సంబంధించిన ‘త్రోట్ స్క్వాబ్’ టెస్ట్ చేయించుకుని తీరాలి. ‘రివర్స్​ ట్రాన్స్ ​స్క్రిప్టేటస్​’ టెస్ట్ అనేది దీనికంటే అడ్డాన్స్​ డ్​ టెస్ట్. ఈ రెండు టెస్ట్​ లు వైరస్ సోకిందా లేదా? అని తెలుసుకునేందుకు చేస్తారు. ఇంకొక టెస్ట్ తల్లి నుంచి బిడ్డకు వ్యాధి ఏమైనా సోకే అవకాశం ఉంటుందా? అన్న టెస్ట్. దీన్ని ‘వర్టకల్ ట్రాన్స్​మిషన్’ అంటారు. ఇది చాలా రేర్ కేస్​ లకు చేస్తారు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు వీలైనంత వరకూ విదేశీ ప్రయాణాలు మానుకుంటేనే మంచిది.
ప్రీ టర్మ్ డెలివరీ
ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణంగా 45 వారాలకు ప్రసవం జరుగుతుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రీ టర్మ్ డెలివరీ అంటే 37 వారాలకే చేస్తారు. అంటే గర్భం దాల్చాక పూర్తినెలలు గడవక ముందే డెలివరీ చేయడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. ఇది మామూలు వాళ్లకు అవసరం లేదు. ఒకవేళ కరోనా(కోవిడ్–19) సోకితే వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి ప్రీ టర్మ్ డెలివరీ చేయించవచ్చు. ఇది ఇమ్యునో కాంప్రమైజ్ స్టేజ్(రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండే సమయం) కాబట్టి తల్లిని కాపాడేందుకు ఇది అవసరపడుతుంది.
డెలివరీ అనంతరం
కాన్పు జరిగాక వీలైనంత వరకూ వెంటిలేషన్ బాగా ఉండే గదిలో తల్లి, పిల్లను ఉంచాలి. పిల్లలకు పాలిచ్చేటప్పుడు తల్లికి జ్వరం లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా మాస్క్​ ఉపయోగించాలి. డెలివరీ జరిగేటప్పుడు జెనేటల్ ఫ్లూయిడ్స్ నుంచి వ్యాధి ట్రాన్సిమిషన్ అయ్యే అవకాశం ఉండదు. అంటే ఇప్పటివరకూ అలాంటి కేసులు ఏమీ నమోదు కాలేదు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తోంది.
ఇతరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
గర్భిణుల వద్దకు, డెలివరీ అయిన వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తే వాళ్లు తప్పనిసరిగా దుస్తులు మార్చుకోవాలి. చేతులు, కాళ్లూ శానిటైజ్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఎక్కువ మంది విజిటర్స్ రాకుండా చూసుకోవడమే మంచిది.