సారథి న్యూస్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి వివరించగా.. వారి కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19ను అరికట్టేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని సైంటిస్టులు తనకు వివరించారని ప్రధాని మోడీ ట్వీట్‌చేశారు. అంతకుముందు మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్నారు. టీకాల తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని గుర్తుచేశారు. మంత్రితో భారత్బయోటెక్ఎండీ డాక్టర్కృష్ణా […]