హైదరాబాద్: స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండోసారి ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని స్కౌట్స్, గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు. 2015లో తొలిసారి స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా విజయం సాధించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కుంబ్ సందేశ్’ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా భారత సంప్రదాయాలు పాటించిదని గుర్తుచేశారు. సంస్కృతిని కొత్త తరానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. వృక్షార్చన పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశానికి చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. అంతకుముందు 2021కు సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా కల్వకుంట్ల కవిత సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె వెంట శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ విషెస్కల్వకుంట్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 26న(బుధవారం) ‘సాహితీ సౌరభం.. అసమాన దార్శనికత’ పేరుతో తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సమాలోచన సభ జరగనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సభకు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు, ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత […]