ఖాళీలు 41,177 పోస్టులు మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: డిసెంబర్ 1 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 41,177 స్థానాలు లేదా మొత్తం మంజూరైన పోస్టుల్లో ఐదుశాతం ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. డిసెంబర్ 1వ […]
ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ […]
చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నెల8న జరిగిన ఘటనలో తొలి సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరో 13మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ గా మారిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. కోయంబత్తూర్ కు చెందిన జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ డిసెంబర్ 8న స్నేహితుడు నాజర్ అతని కుటుంబసభ్యులతో […]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసి: లోక్‌సభలో అరుదుగా మాట్లాడే కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యంత కీలకప్రశ్నను లేవనెత్తారు. సీబీఎస్ఈ 10వ తరగతి సిలబస్‌తో పాటు పరీక్షలో వచ్చిన అంశాన్ని లేవనెత్తారు. దేశ మహిళలను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, సీబీఎస్ఈ సిలబస్‌లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు మితిమీరిన స్చేచ్ఛ వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని , మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు పరీక్షలో క్వశ్చన్‌రావడంపై […]
కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లో అంత్యక్రియలు నివాళులర్పించిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్హర్జిందర్ సింగ్ భౌతికకాయానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సహాయ మంత్రి అజయ్‌భట్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ అడ్మిరల్ హరికుమార్ ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలకు ముందు ఢిల్లీ […]
గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్: హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]
ప్రాజెక్టుల నత్తనడన సాగడంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ ప్రాజెక్టులు నత్తనడకన సాగడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల అమలులో జాప్యంతో తరచూ ప్రాజెక్టు వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని, అయితే వ్యవస్థాగత లోటుపాట్లతోనే ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యంత్రాంగంలో నిర్ణయ రాహిత్యం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమే పెద్దసమస్యగా ముందుకొస్తోందని […]
ఇచ్చిన మాటపై నిలబడకుంటే మరోసారి ఉద్యమం తప్పదు జనవరి 15న సంయుక్త కిసాన్ మోర్చా భేటీ రైతునేత రాకేశ్ టికాయత్ వెల్లడి న్యూఢిల్లీ: రైతులంతా ఇక తమ వ్యవసాయ పనులపై దృష్టి నిలపాలని రైతునేత రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉంటూ అందరూ తమ తమ పనుల్లో మునిగిపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన చేస్తున్న రైతులందరూ ఇంటిబాట పట్టారు. అందులో భాగంగా ఘాజీపూర్ సరిహద్దుల్లో శిబిరాలను ఏర్పర్చుకున్న రైతులు ఆ స్థలాన్ని ఖాళీచేసి […]