చెన్నై: తమిళనాడు గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్‌భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్‌ను కాంటాక్ట్ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.
ఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని […]
భోపాల్: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల […]
స్టాక్‌హోమ్: కరోనా మహమ్మారి ప్రబలుతున్న కారణంగా ఏటా నోబుల్ బహుమతుల గ్రహీతలకు ఇచ్చే విందును రద్దు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో చెప్పింది. ఏటా అవార్డు గ్రహితలతో పాటుసుమారు 1300 మందికి స్టాక్‌హోమ్‌లో విందును ఇస్తారు. ఈ సారి అవార్డులు ప్రకటిస్తామని, కానీ ఆడియన్స్ లేకుండా బాంకెట్ నిర్వహిస్తామని చెప్పారు. ఏటా డిసెంబర్ 10న ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 1956లో హంగేరీ సోవియెట్ యూనియన్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో 49,259కు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 37,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 429 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 842 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్ అర్బన్ […]
ముబై: ‘నేనేమీ ట్రంప్‌ను కాదు. ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోను’ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. శివసేన పత్రిక సామ్నా కోసం సంజయ్‌రౌత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ కామెంట్స్ చేశారు. ఈ వీకెండ్లో ‘అన్‌లాక్’ ఇంటర్వ్యూ పేరుతో రెండు భాగాలుగా ప్రసారం కానున్న వీడియో టీజర్‌ను సంజయ్ రౌత్ తన ట్విట్టర్‌లోఓ పోస్ట్ చేశారు. అయితే థాక్రే ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో […]
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 37,724 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 648 మంది చనిపోయారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,92,915కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 28,732 మంది చనిపోయారని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో ప్రస్తుత లెక్కల ప్రకారం మరణాల్లో మన దేశం స్పెయిన్‌ని దాటేసింది. 7వ స్థానంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు 28,400 మరణాలతో 7వ స్థానంలో ఉన్న స్పెయిన్ […]