Breaking News

జాతీయం

27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!

27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!

సారథిన్యూస్​, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 27న (సోమవారం) సీఎంలతో సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్‌ కట్టడికి వ్యూహాలు, అన్‌లాక్‌ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర […]

Read More
కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త కార్యదర్శిగా రాజేష్ భూషణ్

కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త కార్యదర్శిగా రాజేష్ భూషణ్​

సారథి న్యూస్​, ఢిల్లీ : కేంద్రంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేష్ భూషణ్‌ను కేంద్ర ఆరోగ్య,కుటుంబసంక్షేమ శాఖ కొత్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్థుతం ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రీతి సుడాన్ జులై 31వతేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 1987 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి అయిన రాజేష్ భూషణ్ ను కొత్త కార్యదర్శిగా కేంద్రం నియమించింది. ప్రీతి సుడాన్ పదవీకాలం ఏప్రిల్ తో ముగిసినా కరోనా వల్ల ఆమె పదవీకాలాన్ని […]

Read More
మధ్యప్రదేవ్​ సీఎంకు కరోనా

మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​(61) చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్​లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల […]

Read More
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

14 లక్షలకు చేరువలో కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More
కరోనా రోగులు మిస్సింగ్​

కరోనా పేషెంట్లు మిస్సింగ్​

బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్​నంబర్లు, అడ్రస్​ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వ‌ర‌కూ ఉన్నట్టు సమాచారం. వాళ్లంద‌రికీ క‌రోనా పాజిటివ్ […]

Read More
యూకేపై చైనా సీరియస్‌

యూకేపై చైనా సీరియస్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్‌ వారిపై సీరియస్‌ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్‌ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్​ అయింది. పాంగాంగ్‌, గోగ్రా పోస్ట్‌ నుంచి […]

Read More
90 మంది పోలీసులకు కరోనా

90 మంది ట్రైనీపోలీసులకు కరోనా

బెంగళూర్‌: పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్‌ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రం‌లో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రైనింగ్ సెంటర్‌లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో […]

Read More
20 – 25 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తావ్?

20 – 25 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తావ్?

న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్‌ పైలెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత, సీనియర్‌‌ లాయర్‌‌ కపిల్‌ సిబల్‌ ఫైర్‌‌ అయ్యారు. 20 – 25 మంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిపోతావా? అంటూ ప్రశ్నించారు. పార్టీని పబ్లిక్ ముందు తమాషా చేయొద్దన్నారు. ‘సచిన్‌ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు సీఎం అవ్వాలని అనుకుంటున్నవా? మాకు చెప్పు. ఈ తిరుగుబాటు ఎందుకు? బీజేపీతో కలవను అని చెబుతున్న నీవు హర్యానాలో ఎందుకు ఉన్నావు. పార్టీ సమావేశాలకు ఎందుకు రాననుంటున్నావు. […]

Read More