Breaking News

జాతీయం

రామమందిర పూజకు మోదీ

ఆగస్టు 5న అయోధ్యకు ప్రధాని

న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయోధ్య రామమందిర భూమిపూజకు హాజరు కావల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ చైర్మన్​ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌, విశ్వ హిందు ప‌రిష‌త్ సీనియ‌ర్ ప్ర‌తినిధులు, మహారాష్ట్ర ముఖ్యమం‍త్రి, శివసేన చీఫ్‌ […]

Read More
ఐశ్వర్య ఆమె కూతురు డిశ్చార్జి

కరోనాను జయించిన ఐష్, ఆరాధ్య​

ముంబై: మాజీ మిస్​ వరల్డ్​ ఐశ్వర్యా రాయ్​ బచ్చన్​, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాను జయించారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబంలో జ‌యాబ‌చ్చ‌న్ మిన‌హా మిగిలిన కుటుంబస‌భ్యులు అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డ్డారు. కాగా వీరంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేశారు. ఈ మేరకు సోమవారం అభిషేక్​ బచ్చన్​ ట్వీట్​ చేశారు. ‘మేము కోలుకోవాలని కాంక్షిస్తూ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయి’ […]

Read More
దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!

దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!

సారథి న్యూస్​, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, టీవీల్లోనే పూజా కార్యక్రమాలను వీక్షించాలని కోరింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను పిలవాలనే యోచనలో ఉన్నట్టు ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణానికి అన్ని మతాల ప్రజల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్టు ట్రస్టు సభ్యుడు, […]

Read More
సుప్రీంకోర్టు పిటిషన్​ వాపస్​

సుప్రీంలో పిటిషన్​ వాపస్​

న్యూఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్​ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​చేస్తూ స్పీకర్​ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్​ను వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ సంక్షోభాన్ని […]

Read More
వీడోరకం దొంగ

వీడోరకం దొంగ

భోపాల్‌: దొంగల్లోను చాలా రకాలుంటారు. వాళ్ల అభిరుచులు కూడా భిన్నమే. తాజాగా మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో పోలీసులకు చిక్కిన ఓ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ. ఈ దొంగ కేవలం బాలికలు, యువతుల లోదుస్తులను మాత్రమే కాజేస్తాడు. అనంతరం వాటిని చింపి పీలికలు చేసి పడేసి పైశాచిక ఆనందం పొందుతాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో లేడిస్​ హాస్టల్స్​, యువతులు అద్దెకుండే నివాసాల్లో కొంతకాలంగా రాత్రివేళల్లో లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో బాధిత మహిళలు విజయ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు […]

Read More
ఒకే రోజు 50 వేల కేసులు

ఒకేరోజు 50వేల కేసులు

ఢిల్లీ : మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 49,931 కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 13లక్షల నుంచి కేసుల సంఖ్య 14 లక్షలకు చేరింది. కాగా, దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 32,771 కు పెరిగింది. ఇప్పటివరకు 9,17,567 మందికి రోనా నయం కాగా, ప్రస్తుతం 4,85,114 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

Read More
సిక్కింలో తొలి కరోనా మృతి

సిక్కింలో కరోనా తొలి మరణం

సిక్కిం: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో తొలి కరోనా మరణం సంభవించింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఒదిగి ఉన్న చిన్నరాష్ట్రమైన సిక్కింలో కరోనా కేసులు కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో 140 మంది కోలుకొని డిశ్చార్జ్​ అయ్యారు. కాగా సిక్కింలో శనివారం ఓ వ్యక్తి కరోనాతో చికిత్స పొంది మృతిచెందాడు. అతడికి మధుమేహం, హైబీపీ ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read More
ఆరుబయటే అసెంబ్లీ

కరోనా ఎఫెక్ట్​.. ఆరుబయటే అసెంబ్లీ

పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు. జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు […]

Read More