Breaking News

దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!

దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!

సారథి న్యూస్​, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, టీవీల్లోనే పూజా కార్యక్రమాలను వీక్షించాలని కోరింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను పిలవాలనే యోచనలో ఉన్నట్టు ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణానికి అన్ని మతాల ప్రజల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్టు ట్రస్టు సభ్యుడు, ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపారు. రామాలయ నిర్మాణ విశేషాలతో కూడిన టైమ్‌ క్యాప్సూల్‌లో 2000 అడుగుల లోతులో ఏర్పాటుచేస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్‌ తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలంలోనే ఏర్పాటుచేయనున్న ఈ టైమ్‌ క్యాప్సూల్‌తో భవిష్యత్తు తరాలు ఆలయ చరిత్రను అధ్యయనం చేయటానికి వీలవుతుందని చెప్పారు.