బెంగళూరు: జాతీయ స్థాయిలో పేరొందిన టెక్ ఫెస్ట్ ‘స్టోగో ఫెస్ట్ 2024’ ఈసారి బెంగళూరులో జరగనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఆర్ఆర్ విద్యాసంస్థ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు జయేష్, లిండా వివరించారు. ‘అత్యాధునిక సాంకేతిక వినియోగం.. మానవాభివృద్ధి’ ప్రధాన లక్ష్యంగా ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో జరగనుంది. కాగా, ఈ ఏడాది పిల్లల సంరక్షణలో కృత్రిమమేథ, రోబోటిక్ వినియోగం’అన్న థీమ్ ను అనుసరించి ఈ స్టోగో ఫెస్ట్ జరగనుంది. దేశవ్యాప్తంగా 4 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇందులో విజేతలుగా నిలిచే 2025 యూఏఈలో జరిగే పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలిపారు.
- August 21, 2024
- Archive
- ‘స్టోగో ఫెస్ట్’
- BANGALORE
- stogo fest
- బెంగళూరు
- Comments Off on బెంగళూరులో ‘స్టోగో ఫెస్ట్’