ప్రధాని నరేంద్రమోడీ సెటైర్ యూపీలో స్పోర్ట్స్యూనివర్సిటీకి శంకుస్థాపన మీరట్: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్ ఖేల్’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్ జైల్’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 […]
కుంభమేళా తరహాలోనే వీటి నిర్వహణ సమీక్షలో స్పష్టంచేసిన సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా: గంగాసాగర్ మేళాలో ఎలాంటి కొవిడ్ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. కుంభమేళా జరిగినప్పుడు ఇలాంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఇతర సుదూర ప్రాంతాల నుంచి గంగాసాగర్ మేళాలో పాల్గొనేందుకు వచ్చేవారిని ఎలా ఆపగలమని అడిగారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపంలో జనవరి 8 నుంచి 16 వరకు గంగాసాగర్ మేళా […]
పంటపొలాల్లో పాద ముద్రలు సామాజిక సారథి, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెంలో చిరుత పులి కలకలం రేపుతోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. పంట పొలాల్లో ఓ జంతువుకు సంబంధించిన పాదముద్రలను స్థానికులు గమనించారు. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి పంటపొలాల్లో ఉన్న పాద ముద్రలను పరిశీలించి హైనా పాదముద్రలుగా అనుమానిస్తున్నారు. కాగా, కొంత మంది ప్రత్యక్ష సాక్షులు నిజంగానే చిరుతను చూశామని, దానివెంట పులిపిల్లలు కూడా ఉన్నాయని […]
జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు గురువారం లక్నోకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర స్పష్టత ఇచ్చారు. షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అన్ని రాజకీయపార్టీలు కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి సకాలంలో […]
ఖార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు రాంచి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినవేళ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్ పై రూ.ఐదు, డీజిల్ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ […]
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్ దిగింది. వైరస్ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్ కేజీవ్రాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]
ఒమిక్రాన్ తాజా పరిస్థితిపై ఈసీ సమీక్ష కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోచర్చలు ఐదు రాష్ట్రాల్లో వేగంగా వ్యాక్సినేషన్ జనవరిలో మరోమారు సమావేశం ఎలక్షన్నిర్వహణపై అప్పుడే నిర్ణయం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏంచేయాలనే అంశంపై సీఈసీ ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లతో సోమవారం సమావేశం నిర్వహించింది. ఆరోగ్యశాఖ సమాచారం ఆధారంగా.. ఎన్నికల నిర్వహణపై తుదినిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు […]
బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు పాక్ ఉగ్రవాది అబూజరార్‌ను మంగళవారం హతమార్చాయి. జరార్ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్ ఆపరేషన్’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్‌ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారు. పూంచ్, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]