వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్ చేయాలి అప్పడే వ్యాధిని […]
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. జూలై 30న న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చేరారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
లక్నో: కరోనా మహమ్మారి సామాన్యులను, ప్రముఖులను సైతం బలితీసుకుంటున్నది. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనాతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్ తరన్ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్ తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్‌చేశారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్తే. కేంద్ర వైద్యశాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 51,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకే రోజు ఇంతమంది కోలుకోవడం మనదేశంలో ఇదే ప్రథమం. కాగా ఇప్పటివరకు మొత్తం 11,45,629 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 54,735 కొత్తకేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకున్నది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన […]
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ (64) శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్చ్ లో చికిత్స కోసం ఆయన సింగపూర్ ఆస్పత్రికి కూడా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌లో అమర్‌సింగ్ జన్మించారు. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా రాజ్యసభకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా వంటి దేశాలతో పోల్చుకున్నప్పడు ఇండియాలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 57,118 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,95,988కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో అధికారికంగా 36,511 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా […]
వాషింగ్టన్: అమెరికాలోనూ త్వరలో టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైట్‌హౌస్ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నట్టు ప్రకటించారు. టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్ ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.