ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేస్థాయిలో మరణాలు కూడా రికార్డు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 912 మంది చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 57వేలకు చేరింది. మరో ఏడు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు […]
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఫారం-20 నిబంధనల్లో సవరణలు చేయడం ద్వారా ఓనర్‌షిప్‌నకు సంబంధించి కచ్చితమైన విధానం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని ఫారం-20లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సలహాలు సూచనలు అందజేయాలని సంబంధిత శాఖలను కోరుతూ ఆగస్టు 18న నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు […]
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో శనివారం వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక వ్రతకల్పం చదివారు.
తిరువనంతపురం: షార్జా నుంచి అక్రమ పద్ధతిలో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన రూ.60.26 లక్షల విలువైన 1,357 గ్రాముల బంగారాన్ని కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 10వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ రోజు లోకసభ, మరోరోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు 55,794 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. దేశంలో రికవరి రేటు కూడా […]
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం ఎప్పటికీ కాదని సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారం స్పష్టంచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పేస్ సెక్టార్లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారని, ఇస్రో ప్రైవేట్‌పరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను.. అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేట్‌వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు […]
సారథి న్యూస్, కర్నూలు: భారీవరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. అధికారులు గురువారం ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగులకు గాను 880 అడుగుల మేర నీటినిల్వ ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, 196 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.