Breaking News

క్రైమ్

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం […]

Read More
ట్కా విక్రేతల అరెస్ట్

గుట్కా విక్రేతల అరెస్ట్

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి రూ.5,050 విలువైన గుట్కా ప్యాకెట్ లను పట్టుకున్నారు. ఎవరైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠిన చట్టలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మే వారి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

Read More
లానికి వెళ్లే దారిని మూసివేశారని..

పొలానికి వెళ్లే దారిని మూసివేశారని..

మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనంపల్లిలో కలకలం రేపింది. బాధితులు, గ్రామస్తుల కథనం.. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సాలమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పొలానికి వెళ్తున్న దారిని పల్లెప్రకృతి వనాన్ని నిర్మించేందుకు గాను మూసివేశారు. దారి లేకపోవడంతో రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పంచాయతీ […]

Read More
ఓరి మీ తెలివి ‘‘బంగారం’’ కానూ!

ఓరి మీ తెలివి ‘బంగారం’ కానూ!

బంగారంతో ఏకంగా టీషర్టు మిక్సర్​ గ్రైండర్ లో రెండున్నర కేజీల గోల్డ్ చట్టం నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడుతున్న వైనం సారథి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన దేశానికి తీసుకురావడానికి కొందరు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఒకరు పంటిలో, మరొకరు ఒంటిలో, మరొకరు షూస్​లో అమర్చుకుని తెచ్చిన ఘటనలను చాలా చూశాం.. కానీ వాటికి మించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. బంగారాన్ని రవాణా చేయడానికి ఇన్ని మార్గాలు […]

Read More
కూకట్​ పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?

కూకట్​పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?

హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంలో క్యాష్​ పెడుతుండగా దొంగల కాల్పులు ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం రూ.5లక్షలు దోచుకెళ్లిన దుండగులు సంగారెడ్డిలో నిందితులను పట్టుకున్న పోలీసులు సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడిన దుండగులు పారిపోతూ సంగారెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు. కూకట్​పల్లి పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లో గురువారం డబ్బులు పెట్టేందుకు వెళ్లగా అల్వీన్‌ కాలనీ వైపు నుంచి పల్సర్‌ బైక్ పై వచ్చిన […]

Read More
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి ఆమె శవమై కనిపించింది. అనూషమ్మకు దుర్గమణి, సాయమ్మ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనూషమ్మ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త స్థాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన స్థితిగతులను తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లు పలు ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసర్లమని గ్రామాల్లోని రైతులు, సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డు, సెల్ ఫోన్ లో వచ్చే ఓటీపీ చెప్పాలని నమ్మించి బ్యాంకుల్లోని డబ్బులు […]

Read More
నిషేధిత పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన బాలగొని వేణు అదే గ్రామానికి చెందిన దొనపాని కనుకవ్వ ఇంటి సమీపంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పొగాకు అంబార్ ప్యాకెట్లు నిల్వచేసినట్లు సమాచారం రావడంతో ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కనుకవ్వ […]

Read More