Breaking News

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం రా.. హైదరాబాద్ నుంచి గ్యాంగ్ లను దింపి దాడులు చేస్తామని’ బెదిరిస్తూ షాప్స్ వద్ద మహిళలతో అసభ్యకరంగా ప్రవరిస్తూ రౌడీల మాదిరిగా చలామణి అవుతున్నారు. కర్రలు, రాళ్లతో ఇద్దరిని గాయపర్చారని, గ్రామస్తులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని ఎస్సై తెలిపారు. ప్రశాంతమైన పల్లెల్లో అలజడి సృష్టించి గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి హెచ్చరించారు.