సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగలనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి కుడి భుజంగా ఉంటూ రాష్ట్రస్థాయి పదవులతో ఓ వెలుగు వెలిగి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ లీడర్ జక్కా రఘునందన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పాటు ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం ఓటమిపాలు కావడంతో ఆయన […]
సామాజిక సారధి, నాగర్ కర్నూల్:కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను 62 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోగల అరవై రెండు మంది లబ్ధిదారులకు చెందిన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన పనిచేస్తుందని, గత ప్రభుత్వం లో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా […]
సామాజిక సారథి , నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామం లో ని తోట పల్లి సుబ్రమణ్యం విద్యాలయం లోనీ పాఠశాలలో1997 – 1998 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు బాలాజీ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సుబ్బయ్య విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు […]
# ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ చేస్తే జైలుకేఆకతాయిలు వేధిస్తే షీ టీం కు ఫిర్యాదు చేయండి నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్. సామాజిక సారథి, నాగర్ కర్నూల్:.జిల్లాలోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా షీ టీమ్ ఇంఛార్జి, అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు. గురువారం బిజినపల్లి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా అఢిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]
– నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వద్ద బావా బామ్మర్దులదే పెత్తనం – పదిహేను రోజుల ముందు వచ్చి అంతా తమే అంటున్న బావ బామ్మర్దులు – వీళ్ళ పెత్తనం ఏమిటంటు కార్యకర్తల అసహనం సామాజిక సారధి , నాగర్కర్నూల్ బ్యూరో : నాగర్ కర్నూల్ నియోజకవర్గo లో ఇద్దరు చెంచా రాజకీయ నాయకులు బావ , బామ్మర్దులు అయినప్పటికీ ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే వారి వద్ద ఉంటూ ఎమ్మెల్యే అయినా తాము […]
#జిల్లా ఆస్పత్రిని అకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి#సానిటరీ సూపర్వైజర్ ను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశం నాగర్ కర్నూల్, సామాజికసారథి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కుచూకుల్ల రాజేష్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు చెత్త చెదారాలతో, మెడికల్ వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉండడాన్ని ఎమ్మెల్యే గమనించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఇంత నిర్లక్ష్యం […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నియోజకవర్గంలో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి లు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా […]
# ఆగ్రహంతో డీఈఓ పై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు # ప్రభుత్వాలు మారిన ఇంకా మాజీలకే ప్రాధాన్యతనిస్తున్న అధికారులుసామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో:ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారము స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని ఆహ్వానించిన విద్యాశాఖ అధికారి గోవిందరాజులు స్థానిక ఎమ్మెల్యే రాకముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో పాఠశాలను ప్రారంభించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది తాడూరు మండలం శిరిసవాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను […]