Breaking News

వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమీక్ష

  • February 20, 2024
  • Archive
  • Top News
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమీక్ష

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నియోజకవర్గంలో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి లు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా తాగునీటి సరఫరాలో పెండింగ్ పనులు ఉంటే అధికారులు వెంటనే వాటిని సరిచేయాలని అన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి మిషన్ భగీరథ స్కీంతో పాటు ఇతర పథకాల సమస్యలు ఏవీ ఉన్నా వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.