సామాజికసారథి, వనపర్తి బ్యూరో: ప్రభుత్వ విద్యాభివృద్దికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. వనపర్తి జిల్లాలో ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే గురుకులాలు, కేజీబీవీ లు, మోడల్ కాలేజీ లు ఫలితాల్లో ముందంజలో ఉన్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం అట్టడుగుకు పోయాయి. వనపర్తి జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో వనపర్తి బాయ్స్, వనపర్తి […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై […]
సామాజికసారథి, మెదక్ బ్యూరో: ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది. డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు ప్రభుత్వ టీచర్, ఆయన భార్య ఉన్నారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం..చిలప్ చెడ్ మండలం రహీంగూడకు చెందిన నునావత్ రవీందర్(38), ఆయన భార్య అమృత (33) ఓ భార్య బైక్ పై ఓ శుభకార్యం కోసం నర్సాపూర్ వెళ్తున్నారు. […]
సామజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 20 జిల్లాలకు పైగా రైతులు అకాలవర్షానికి సతమతమవుతూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు సమ్మేళనాల పేరుతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని వెంటనే రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల, బడానేతల అండదండలతో తాము కోరుకున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు పొందుతున్న కొందరి ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. తమకు పోస్టింగ్ ఇప్పించినవారి సేవలో తరించడమే కాదు వారు కనుసైగ చేస్తే చాలు తప్పుడు కేసులతో పాటు సామాన్యులకు పోలీస్ మార్క్ టెస్టీ చూపిస్తున్నారు. తమ స్టేషన్ల పరిధిలో తప్పు చేసినోడు మనోడని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు […]
సామాజిక సారధి , బిజినపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే యువకుడు మృతి చెందాడు . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం త్రాగునీరు రావడంతో బోరు మోటర్ వేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ జరిగిందని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు . మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . మృతుడు గ్రామంలోని ల్యాబ్ టెక్నీషియన్ నిర్వహుడుగా ఉంటూరని తెలిపారు . దీంతో […]
బీఆర్ఎస్ మాజీమండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డిసామాజికసారథి,చిలప్ చెడ్: పార్టీలో గుర్తింపులేదని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిలప్ చెడ్ రైతు వేదిక(శిలంపల్లి)లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తిస్తలేదని, తెలంగాణ ఉద్యమం నుండి ఉమ్మడి కౌడిపల్లికి అధ్యక్షతగా […]