Breaking News

Year: 2022

టీనేజర్లకు టీకాతో ఆరోగ్య రక్ష

టీనేజర్లకు టీకాతో ఆరోగ్య రక్ష

  • January 14, 2022
  • Comments Off on టీనేజర్లకు టీకాతో ఆరోగ్య రక్ష

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: టీనేజర్లకు కోవిడ్ టీకాతోనే కరోనా మహామ్మారి నుంచి ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన బూస్టర్ డోస్ వేసుకొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. బయటికి వెళ్తున్న వారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి మాస్క్ ధరించాలన్నారు.  ఒమిక్రాన్ ను నివారించేందుకు ఈ బూస్టర్ డోస్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.

Read More
ఈవీఎం గోదాం పరిశీలన

ఈవీఎం గోదాం పరిశీలన

  • January 14, 2022
  • Comments Off on ఈవీఎం గోదాం పరిశీలన

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో గోడౌన్లో భద్ర పరచిన ఈవీఎంలను వార్షిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గురువారం జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈవీఎం గోదాం పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముందుగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. సీసీ కెమెరా గదిలోకి వెళ్లి కెమెరా పనితీరును పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా..? లేదా.. ? అన్నది […]

Read More
అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్‌: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. విజయ్‌ కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ  చూడలేదని […]

Read More
ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్

ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్

  • January 12, 2022
  • Comments Off on ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్

14న ముగియనున్న చైర్మన్​కె.శివన్ పదవీకాలం న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్ గా అంతరిక్షశాఖ కార్యదర్శి, రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియమించారు. తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలకపాత్ర పోషించారు. కేరళకు చెందిన ఎస్.సోమనాథ్ కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ […]

Read More
నయీంను మించిన ‘వనమా’

నయీంను మించిన ‘వనమా’

కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్‌ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ ‌: ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]

Read More
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

సామాజిక సారథి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్‌ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్​దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్‌ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]

Read More
ఆలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించండి

ఆలయాల్లో కొవిడ్ ​నిబంధనలు పాటించండి

  • January 12, 2022
  • Comments Off on ఆలయాల్లో కొవిడ్ ​నిబంధనలు పాటించండి

సామాజిక సారథి, హైదరాబాద్‌: వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్‌ చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని, ముఖ్యంగా మాస్క్​, భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం […]

Read More
ఆదివాసి పెద్దలు సహకారించాలి

ఆదివాసి పెద్దలు సహకారించాలి

 మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]

Read More