Breaking News

ఈవీఎం గోదాం పరిశీలన

ఈవీఎం గోదాం పరిశీలన

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో గోడౌన్లో భద్ర పరచిన ఈవీఎంలను వార్షిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గురువారం జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈవీఎం గోదాం పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముందుగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. సీసీ కెమెరా గదిలోకి వెళ్లి కెమెరా పనితీరును పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా..? లేదా.. ? అన్నది పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సెక్యూరిటీ గార్డ్ విధులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించవద్దని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసి శ్రీశైలం, టీఆర్ఎస్ ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవి, ఎంఐఎం పార్టీ ప్రతినిధి హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ఖాజా, ఎన్నికల విభాగం సిబ్బంది అశోక్ తదితరులు ఉన్నారు.