Breaking News

Year: 2022

నమ్ము రూముకు రమ్మంటున్నాడు

నమ్ము రూము​కు రమ్మంటున్నాడు

సంతకం చేస్తుంటే చేయి పట్టుకున్నాడు వీపనగండ్ల గురుకులంలో ప్రిన్సిపల్ కీచకపర్వం మహిళా టీచర్​ను వేధిస్తున్న డి.శ్రీనివాస్​​ నాలుగు పేజీల లేఖలో లేడీ టీచర్ ​ఆక్రందన సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ కీచరపర్వం సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మ్యాథ్స్​ బోధించే ఓ మహిళా టీచర్​ను ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను గుండెల్లో దాచుకొని.. కనీసం భర్తతో […]

Read More
టెట్​షెడ్యూల్ రిలీజ్

telangana.. టెట్​ షెడ్యూల్ రిలీజ్

సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గురువారం టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 12ను దరఖాస్తులకు చివరితేదీగా గడువు విధించింది. జూన్ 12న పరీక్ష నిర్వహించనుంది.

Read More

కార్యకర్తల ప్రేమానురాగాలు మరువలేనివి

ఎమ్మెల్సీ తనయుడు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని కార్యకర్తల ప్రేమానురాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలో ఆయన కార్యకర్తల ఇంటికి వెళ్లి కొంతసేపు గడిపారు. సీనియర్ కార్యకర్త హసన్ ఇంటిలో టిఫిన్ చేసి పట్టణంలోని కొందరు కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి ఇంటికి […]

Read More
నింగికేగిన పోరుకెరటం

నింగికేగిన పోరుకెరటం

తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత నిజాంసర్కారును వణికించిన ధీరవనిత బతుకమ్మ పాటలతో ప్రజల్లో చైతన్యం కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం రేపు నల్లగొండలో అంత్యక్రియలు సామాజికసారథి, హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట […]

Read More
పత్తికి రికార్డు రేటు

పత్తికి రికార్డు రేటు

:: జితేందర్​రెడ్డి,సామాజిక సారథి, వరంగల్ ​ప్రతినిధిసెల్​నం: 90005 66615 వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఏకంగా క్వింటాలుకు రూ.10వేలు దాటి ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాలుకు రూ.10,100కు అమ్ముడుపోయింది. మంచి లాభసాటి ధర రావడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరి క్వింటాలుకు […]

Read More
స్నానం చేస్తున్నా వదల్లే..!

స్నానం చేస్తున్నా వదల్లే..!

కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్​చేసిన పోలీసులు వనపర్తిలో సీఎం పర్యటన నేపథ్యంలో చర్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వనపర్తిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నేతలను మంగళవారం ముందస్తుగా అరెస్ట్​చేశారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో కూడా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తెల్కపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వారణాసి శ్రీనివాస్‌ స్నానం చేసేందుకు వెళ్తుండగా బాత్​రూం వద్ద నుంచే బట్టలు […]

Read More
ఇది చేస్తే చాలు శివానుగ్రహం పొందినట్లే!

ఇది చేస్తే చాలు శివానుగ్రహం పొందినట్లే!

శివుడు అభిషేక ప్రియుడు జాగరణం శివరాత్రి ప్రత్యేకత ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం: శివుడు అభిషేకప్రియుడే గాకుండా.. బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి రోజున విధిగా చేస్తుంటారు. పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడం చేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. త్రిమూర్తుల్లో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. మహాశివరాత్రి […]

Read More
గుండాలకు ‘కాశీ’ విశిష్టత

గుండాలకు ‘కాశీ’ విశిష్టత

సామాజిక సారథి, వెల్దండ: దక్షిణకాశీగా పేరొందిన, స్వయంభుగా వెలిసిన గుండాల అంబా రామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహాగణపతిపూజ, పూణ్యాహవాచనం, ధీక్షాధారణ, రక్షాబంధనం, యాగశాల ప్రవేశంతో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈనెల 1న మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశరుద్రాభిషేకం, అభిషేకం అలంకరణ, లలితా అష్టోత్తర కుంకుమార్చాన వంటి విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు, అర్చకులు తెలిపారు. 2వ తేదీన మూలమంత్ర హవనం, వాస్తుమండపారాధాన, […]

Read More