కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్చేసిన పోలీసులు వనపర్తిలో సీఎం పర్యటన నేపథ్యంలో చర్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వనపర్తిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నేతలను మంగళవారం ముందస్తుగా అరెస్ట్చేశారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో కూడా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తెల్కపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వారణాసి శ్రీనివాస్ స్నానం చేసేందుకు వెళ్తుండగా బాత్రూం వద్ద నుంచే బట్టలు […]