Breaking News

స్నానం చేస్తున్నా వదల్లే..!

స్నానం చేస్తున్నా వదల్లే..!

  • కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్​చేసిన పోలీసులు
  • వనపర్తిలో సీఎం పర్యటన నేపథ్యంలో చర్యలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వనపర్తిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నేతలను మంగళవారం ముందస్తుగా అరెస్ట్​చేశారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో కూడా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తెల్కపల్లికి చెందిన యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వారణాసి శ్రీనివాస్‌ స్నానం చేసేందుకు వెళ్తుండగా బాత్​రూం వద్ద నుంచే బట్టలు లేకుండా అరెస్ట్​చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఆయనతో మరో మరో 10మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్​చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోలీసులు కనీస మర్యాద ఇవ్వకుండా ఇళ్లలోకి వచ్చి తమను తీసుకెళ్లడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కూర్చుని అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. పోలీసుల ముందస్తు అరెస్ట్​ల పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు.