Breaking News

Month: March 2022

పెట్రోమంటపై భగ్గుమన్న కాంగ్రెస్‌

పెట్రోమంటపై భగ్గుమన్న కాంగ్రెస్‌

దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు విజయ్‌ చౌక్‌ వద్ద రాహుల్‌ గాంధీ నేతృత్వంలో పార్టీ నేతల ధర్నా న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై నిరసన సెగ పార్లమెంట్​ను తాకింది. పదిరోజుల్లో వరుసగా 9 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచడంపై కాంగ్రెస్‌ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. పెరుగుతున్న ధరలపై ఆ పార్టీ ఎంపీలు లోక్​సభలో నిరసనగళం వినిపించారు. పెంచిన ధరలను పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించాలని పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ […]

Read More
ఆంజనేయుడి ఆలయానికి నెల జీతం విరాళం

ఆంజనేయుడి ఆలయానికి నెల జీతం విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అభయ ఆంజనేయుడి ఆలయం నిర్మాణానికి తనవంతుగా గురువారం గ్రామ సేవకుడు తవిటి నిరంజన్ తన ఒకనెల వేతనం రూ.10,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్​ రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నీరటి రాములు, గ్రామస్తులు భూపతిరావు, కావటి రామచంద్రం, దశరథం, సత్యనారాయణ, వెంకట్ నారాయణ, రామచంద్రయ్య, హనుమంతు, జంగయ్య, అశోక్ యాదవ్, కర్ణాకర్​రావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Read More
అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో కొట్లాట

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో కొట్లాట

ఎస్సైకి నిప్పంటుకున్న వైనం రెండువర్గాలుగా విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు సామాజికసారథి, జోగుళాంబగద్వాల: జిల్లాలోని కేటీదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా గురువారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు రెండువర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్‌ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సైకి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థివర్గం వారు వెంటనే […]

Read More
మనుషులంతా ఒక్కటే

మనుషులంతా సమానమే

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గురువారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సై ఎం.నర్సింహులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ ​దార్ల కుమార్​ సమక్షంలో దళితులతో ఆలయ ప్రవేశం చేయించారు. మనుషులంతా ఒక్కటేనని, కులమత బేధాలు పాటించకూడదని సూచించారు. అంటరానితనం, మనుషుల విబేధాలు, వైషమ్యాలు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని ఎస్సై నర్సింహులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అందరూ కలిసిపోవాలని కోరారు. దైవం అందరికీ సమానమేనని అన్నారు. సాటి మనుషుల పట్ల వివక్ష చూపించడం చట్టరీత్యా […]

Read More
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్: మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఇంతియాజ్ ఇసాక్ ను డెంటల్​ డాక్టర్ ​అసొసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, టీఆర్ఎస్​ యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి గురువారం మర్వాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం

రాతిపెడ్డలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పాలమూరు ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో రాయి కూలి వ్యక్తి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా సొరంగం (టన్నెల్) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్ రెడ్డి రోజూ లాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకొని […]

Read More
గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్

గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్

44మంది విద్యార్థినులకు అస్వస్థత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సాంఘిక శాఖ సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం స్కూలులో బ్రేక్ పాస్ట్ లో పులిహోర తిన్న విద్యార్థినులు టిఫిన్ చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. […]

Read More
గురుకులంలో కీచకపర్వంపై కలెక్టర్​సీరియస్​

గురుకులంలో కీచకపర్వంపై కలెక్టర్​ సీరియస్​

ప్రిన్సిపల్ ​డి.శ్రీనివాస్ ​వ్యవహారంపై విచారణ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్తకోట పోలీసులు సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రస్తుతం కొనసాగుతున్న వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయినిపై ప్రిన్సిపల్ కీచరపర్వం ఆలస్యంగా వెలుగు చూడటంతో జిల్లా కలెక్టర్ యాస్మిన్​భాషా స్పందించారు. వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్​ను పిలిచి ఛీవాట్లు పెట్టారు. ఆయన ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాథ్స్ టీచర్ ​టి.మాధవిని ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు […]

Read More