సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గురువారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సై ఎం.నర్సింహులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ దార్ల కుమార్ సమక్షంలో దళితులతో ఆలయ ప్రవేశం చేయించారు. మనుషులంతా ఒక్కటేనని, కులమత బేధాలు పాటించకూడదని సూచించారు. అంటరానితనం, మనుషుల విబేధాలు, వైషమ్యాలు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని ఎస్సై నర్సింహులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అందరూ కలిసిపోవాలని కోరారు. దైవం అందరికీ సమానమేనని అన్నారు. సాటి మనుషుల పట్ల వివక్ష చూపించడం చట్టరీత్యా నేరమని సూచించారు. గ్రామాభివృద్ధి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ దార్ల కుమార్ కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- March 31, 2022
- Archive
- Top News
- జాతీయం
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- bairapur
- HUMAN RIGHTS
- ఆలయ ప్రవేశం
- పౌరహక్కులు
- వెల్దండ
- Comments Off on మనుషులంతా సమానమే