Breaking News

Month: January 2022

రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అధికం నేటి నుంచి బూస్టర్​డోస్​వ్యాక్సినేషన్​ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 330 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు 6,94,030 కొవిడ్ కేసులు నమోదుకాగా, వారిలో 6,76.466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తదితర […]

Read More
పెరియార్ విగ్రహానికి చెప్పుల దండ

పెరియార్ విగ్రహానికి చెప్పుల దండ

చెన్నై: కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్‌ స్టడీ సెంటర్‌ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేసి తలపై కుంకుమపువ్వు పొడిని చల్లారు. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని ద్రవిడర్ కజగం నేతలకు తెలపడంతో వారు ఆందోళనకు దిగారు. అనంతరం పోదనూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో మెడలోని చెప్పుల దండను తొలగించి.. కుంకుమను శుభ్రం చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు […]

Read More
బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి […]

Read More
మోడీ డ్రామా.. పదవిని దిగజార్చింది

మోడీ డ్రామా.. పదవిని దిగజార్చింది

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సామాజికసారథి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగజార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు జనాలు రాకే కారణం వెతుక్కున్నారని విమర్శించారు. పంజాబ్‌ సీఎంను నవ్వులపాలు చేయాలని చూశారని, గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాయితో దాడి చేసినా నిందలు వేయలేదని గుర్తుచేశారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధిస్తున్నారని, పంజాబ్‌ సీఎం ఫెయిల్ అయినట్లు చూపే […]

Read More
పోలీసులను అడ్డంపెట్టుకొని ఆగడాలు

పోలీసులను అడ్డంపెట్టుకొని ఆగడాలు

బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ […]

Read More
సమీక్ష చేశారు కానీ అమలు జరిగేలా చూసేదేవరు.

సమీక్ష చేశారు కానీ అమలు జరిగేలా చూసేదేవరు

  • January 10, 2022
  • Comments Off on సమీక్ష చేశారు కానీ అమలు జరిగేలా చూసేదేవరు

ఆధ్యాత్మిక భావం వదిలి ఆదాయమార్గం వైపు మొగ్గు. పనిచేయని స్థానిక ఆలయ కమిటీ మంత్రము. ఈవో మార్పు దేనికి సంకేతం? సామాజిక సారథి, ఐనవోలు:  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శివ క్షేత్రాల్లో హన్మకొండ జిల్లాలోని  ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం చాలా ప్రసిద్ధ చెందినది.  భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా,  గొల్ల కురుమల  కొలిచే స్వామి మల్లికార్జున స్వామి. సంక్రాంతి నుండి మొదలు ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే స్వామి […]

Read More
బోళ్ల రాకేష్ రెడ్డి కిడ్నాప్ యత్నం...?!

బోళ్ల రాకేష్ రెడ్డి కిడ్నాప్ యత్నం…?!

  • January 10, 2022
  • Comments Off on బోళ్ల రాకేష్ రెడ్డి కిడ్నాప్ యత్నం…?!

మహబూబాబాద్ సిటీలో సుపారి గ్యాంగ్స్ హల్చల్ సీసీ కెమెరాల నిఘా అవసరం అంటున్న ప్రజలు? సామాజిక సారథి , మహబూబాబాద్:  మహబూబాబాద్ పట్టణంలో రెండు సుపారి గ్యాంగ్స్ పట్టణానికి చెందిన బోళ్ల రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు తెగబడి విఫలమై పోలీసులకు చిక్కారు. ఖమ్మం పట్టణంకు చెందిన కొడకండ్ల సురేష్ ఎ.ఎన్.ఎక్స్(సిటీ కేబుల్) అనే వ్యక్తి మహబూబాబాద్ కు చెందినబోళ్ల రాకేష్ రెడ్డిని  రెండు వాహనాల్లో సుమారు 10 మంది కిరాయి గుండాలతో కలిసి వచ్చి మహబూబాబాద్ […]

Read More
కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు

జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి:  జిల్లాలో అర్హులందరూ జాప్యం చేయకుండా  వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లా ప్రజలు  అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. టీకా పొందినవారికి ప్రమాదం లేదని,  రెండు డోసులు టీకా పొందినవారు సురక్షితమన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్నారు. […]

Read More