సామాజికసారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బార్లు, వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. డిసెంబర్ 31న వైన్ షాపులు సైతం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. అయితే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని […]
సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ పోరాట ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సాహసించలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు […]
కేంద్రమార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సామాజికసారథి, హైదరాబాద్: జనవరిలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలు, 60ఏళ్ల పైబడిన వారికి ఇస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ పేదలకు ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు సక్సెక్స్ అయ్యాయి. దీంతో వాటిని ఇతర పట్టణాలకు విస్తరించేందుకు సర్కారు సిద్ధమైంది. […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
దేశానికి మోడీ, రాష్ట్రానికి కేసీఆర్ప్రమాదకరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజం ఘనంగా కాంగ్రెస్‌పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సామాజికసారథి, హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్‌పార్టీ దిశానిర్దేశం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చనని స్వాతంత్య్ర సంగ్రామం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిందని కొనియాడారు. అలీన విధానం, హరితవిప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటీ సిస్టం, ఉపాధిహామీ పథకం, సాంకేతిక అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో 137వ పార్టీ ఆవిర్భావ […]
ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్ వే మార్గంగా […]
ప్రపంచ వ్యాప్తంగా పంటకు డిమాండ్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ హైటెక్స్ రెండు రోజుల పాటు జాతీయ సదస్సు సామాజికసారథి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగుతో మంచి లాభాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉందన్నారు. సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పరిశ్రమ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. సదస్సు సహా […]
కాంగ్రెస్ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]