సామాజిక సారథి, తెల్కపల్లి: తెల్కపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ సీఎల్ఆర్ కాలేజీలో నిర్వహిస్తున్న ఉయ్యాలవాడ, కోడేర్, తాడూర్ బీసీ గురుకులాల్లో 600మంది విద్యార్థులకుగాను 12మంది టీచర్లు పనిచేస్తున్నారన్నారు.16సెక్షన్లు ఉంటే సెక్షన్ కి ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరన్నారు. 80మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి బోధన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు పడుకోవడానికి కూడా వసతులు లేని స్థితిలో […]
సామాజిక సారథి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ పల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి శివలక్ష్మి, ముగ్గురు సతానం ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండులైన నేతగా పేరొందారు. వయస్సు రీత్యా రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలన […]
సామాజిక సారథి, వెల్దండ: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిగా నిరసనగా శుక్రవారం బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్విగ్రహం ఎదుట హెచ్పీ పెట్రోల్బంక్వద్ద దళితమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాప వెంకట్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు యెన్నం విజేందర్ రెడ్డి, జూలూరి బాలస్వామి, జిల్లెళ్ల జంగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ […]
సామాజిక సారథి, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్ పేట్ గుర్రాల ముత్యం రెడ్డి గారి ఆద్వర్యంలో ఎంఎస్రెడ్డి లయన్స్ నేత్ర వైద్యశాల వారిచే గత వారం రోజుల నుండి ఈ రోజు వరకు ఉచిత కంటి పరీక్ష ,ఆపరేషన్ 143మందికి , కంటి అద్దాలు 180 మంది కి పంపిణీ చేశారు.అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో 6వ చదువుతున్న వెగ్గళం స్వాతి […]
సామాజిక సారథి, మహబూబ్ నగర్: నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై చిందులేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ డిమాండ్. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు దళారి పాత్ర వ్యవహరిస్తూ ఫార్మసిస్ట్ ల సర్టిఫికెట్లు అద్దెలకు తీసుకొని మందుల షాపు లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమన్నారు. మెడికల్ షాపుల లైసెన్సుల జారీలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పాత్ర ఏమిటో […]
సామాజిక సారథి, డిండి: దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను, సదుపాయాలను వినియోగించుకోవాలని మండల విద్యాధికారి ఈ. సామ్య నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 21రకాల వైకల్యాలను గుర్తించి, పెన్షన్ సౌకర్యం, విద్యా రంగంలో ప్రత్యేక పాఠశాలు, స్కాలర్షిప్లలు, అందజేస్తుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ముందుకెళ్లాలని సూచించారు. సరైన ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాలలో రాణించగలరని ఆమె పేర్కొన్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం చందర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, […]
సామాజిక సారథి, వైరా: ఖరీఫ్ సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం విధించిన షరతులను సడలించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా మార్కెట్ లో ధాన్యం విక్రయించుకొనేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో […]
సామాజిక సారథి, నాగర్కర్నూల్: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు వసీం రిజ్వీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ ముస్లిము సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనల అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు జైనులాబుద్దిన్ మాట్లాడుతూ ముస్లిముల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ లోని పలు […]