కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: మాజంలో ఏ ఒక్కరూ వెనకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళర్పిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 చారిత్రక దినం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశతత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా […]
రాజ్యాంగ నిబంధనలకు మోడీ సర్కార్ తూట్లు అందుకే మేము పాల్గొనడం లేదు: మాయావతి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించే నైతిక హక్కు లేదని, అందుకే ఈ కార్యక్రమాల్లో తమ పార్టీ పాల్గొనడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి నిబద్ధతతో అనుసరిస్తున్నామా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమీక్షించుకోవాలని […]
ఇంటర్ నేషనల్ విమాన సేవల పునరుద్ధరణ కొత్త వేరియంట్ కారణంగా 14 దేశాలకు రద్దు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి విదేశాలకు రెగ్యులర్ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే 14 దేశాలకు మాత్రం విమానాలను ఇప్పుడే నడపబోవడం లేదని ఏవియేషన్ మంత్రిత్వశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్ తీవ్ర ఎక్కువగా ఉన్న, కొత్త […]
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ నేడు, రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా సామాజిక సారథి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోడీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదుకోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర […]
వరంగల్ కలెక్టర్ బి.గోపి సామాజిక సారథి, వరంగల్: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమని, ఎవరైనా ప్రయత్నిస్తే జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలుశిక్ష పడుతుందని వరంగల్ కలెక్టర్ బి.గోపి సూచించారు. పీసీపీఎన్డీటీ పైన జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భస్థ పిండ పరీక్షలు చేసే సెంటర్ల యజమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే టోల్ […]
సామాజిక సారథి, ములుగు: పిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సేక్టరియాల్ అధికారుల సమావేశంలో అయన మాట్లాడారు. కుంభ మేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అ సౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండాలన్నారు.గత జాతరను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు […]
సామాజిక సారథి, జోగిపేట: రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ తెలుసుకోవాలని స్థానిక కోర్టు మెజిస్ట్రేట్ ధనలక్ష్మి సూచించారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జోగిపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన ఎంతో అవసరం అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.