సామాజిక సారథి, మహబూబాబాద్: తక్కలపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన అనుచరులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనుచరుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ మానుకోట ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రవీందర్ రావు ఎమ్మెల్సీ పదవి రావడం సంతోషకరమన్నారు. రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవొస్తే అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారికి 101కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకుంటామని మొక్కినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. […]
సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు గాను మొత్తం 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురి నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల పరిశీలన అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ […]
సామాజిక సారథి, రామడుగు: మండలంలోని దత్తోజిపేట్ గ్రామంలో అయ్యప్ప భక్తులు గంట్ల బాపిరెడ్డి నివాసంలో తోట శ్రీనివాస్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ బుధవారం ఘనంగా నిర్వహించారు. గణపతి సుబ్రమణ్య స్వామి సమేత అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. బాపిరెడ్డి కుటుంబ సభ్యులు దాదాపు 50 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే నోముల భగత్ సామాజిక సారథి, హలియా: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నఅభివృద్ధికి ఆకర్షితులై అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని నాగార్జున సాగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం సాయంత్రం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు ఆలీనగర్ కి చెందిన 89 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ […]
సామాజిక సారథి, కౌడిపల్లి: యాసంగి లో పంటల సాగు పగడ్బందీగా సర్వే నంబరు ప్రకారం ప్రతి రైతు పంట సాగు వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ సూచించారు. బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో కౌడిపల్లి డివిజన్ లోని నాలుగు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వాన కాలంలో అధిక మొత్తంలో వరి పండించడం […]
సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.
సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]
సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]