రూ.3లక్షల విలువైన పంచలోహ విగ్రహాల అపహరణ సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గుట్టపై వెలిసిన వేంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలను ఎత్తికెళ్లారు. వేంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, పద్మావతి విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. సుదర్శనచక్రం, స్వామి, మరో రెండు విగ్రహాలను ఎత్తికెళ్లారు. వాటి విలువ సుమారు రూ.రెండు లక్షల మేర ఉంటుందని పూజారి శివయ్యశర్మ తెలిపారు. […]
జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]
సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గురువారం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 200 మంది విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ప్రభుత్వం విస్మరించిందని, పాఠశాలలు తెరుచుకోకపోవడంతో 14 నెలలుగా […]
సారథి, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఏపీ, తెలంగాణ బోర్డర్ పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రాకపోకలను ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. అలంపూర్ ప్రాంతానికి కర్నూలు పట్టణం చేరువలో ఉండటంతో ప్రతి చిన్న పనికి అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ విషయమై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి జోగుళాంబ […]
సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో […]
సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి రూ.5,050 విలువైన గుట్కా ప్యాకెట్ లను పట్టుకున్నారు. ఎవరైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠిన చట్టలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మే వారి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
సారథి, బుగ్గారం(జగిత్యాల): జగిత్యాల జిల్లా నూతన మండల కేంద్రమైన బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీలో సుమారు రూ.30లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఆయన ఆరోపించారు. ఇదంతా అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవలం రూ.16,14,585కు మాత్రమే షోకాజ్ […]