సారథి, రామడుగు: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్య సెల్ మండలాధ్యక్షుడు బొజ్జ తిరుపతి స్వీట్లు పంచిపెట్టారు. ఈటల రాజేందర్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడవెల్లి రామ్, మండల ఉపాధ్యక్షుడు ఎడవెల్లి లక్ష్మణ్, కట్ట రవీందర్, […]
సారథి, వేములవాడ: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో పేదలు, కూలీలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. మంగళవారం 32వ రోజు పేదలకు ఆహారం అందజేశారు. పేదల కోసం శ్రమిస్తున్న మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, వర్కింగ్ టీంలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.
మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనంపల్లిలో కలకలం రేపింది. బాధితులు, గ్రామస్తుల కథనం.. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సాలమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పొలానికి వెళ్తున్న దారిని పల్లెప్రకృతి వనాన్ని నిర్మించేందుకు గాను మూసివేశారు. దారి లేకపోవడంతో రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పంచాయతీ […]
సారథి, అచ్చంపేట: ఆదాయం కోసం సర్కారు భూములను అమ్మడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా నాయకురాలు, అచ్చంపేట 10వ వార్డు కౌన్సిలర్ సునీతారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా అవసరాలు స్కూళ్లు, ఆస్పత్రులు, గోదాములు తదితర వాటి కోసం ప్రభుత్వ ఆస్తులను వినియోగించాలి కానీ ఇలా విక్రయించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఆదాయమంతా ఎవరి […]
సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు సాయం వానాకాలం పంటకాలానికి గాను మంగళవారం నుంచి రైతుఖాతాలో జమ చేయనునందున స్థానిక టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర రైతులందరికీ ప్రతి ఎకరాకు రూ.ఐదువేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని కొనియాడారు. కార్యక్రమంలో రైతుబంధు మండలాధ్యక్షుడు జూపాక కరుణాకర్, ఎంపీటీసీలు మడి శ్యామ్, నాయకులు ఎడవెల్లి పాపిరెడ్డి రెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ కుమార్, పార్టీ […]
సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. […]
సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలో నష్టపోయిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములుకు బాధిత రైతు బొక్కల శ్రీను వినతిపత్రం అందజేశాడు. మంగళవారం వెల్దండకు వచ్చిన ఆయనకు సదరు రైతు కలిసి సమస్యలను వినతిపత్రంలో విన్నవించాడు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూనష్టపరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు.
నివాళులర్పించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సారథి, వెల్దండ: కల్నల్ సంతోష్ కుమార్ త్యాగం వృథాకాదని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ కొనియాడారు. చైనా, భారత సరిహద్దులో దేశరక్షణ కోసం యుద్ధరణరంగంలో అసువులుబాసిన ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ కుమార్ అమరత్వానికి ప్రతీకగా మంగళవారం వెల్దండ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సంతోష్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి […]