Breaking News

Month: April 2021

పల్లెప్రగతి పనుల పరిశీలన

పల్లెప్రగతి పనుల పరిశీలన

సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా డీఆర్డీఏ విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, డీఆర్డీఏ జిల్లా ఎస్​బీఎం కన్సల్టెంట్ జి.చిరంజీవి శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామం, కంపోస్ట్ ​షెడ్, సానిటరీ వర్క్, పరిశుభ్రత, నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇనుముల రమేష్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేణి వేణు, […]

Read More
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సారథి, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జుకల్, సంగారెడ్డిపేట్, కొత్తపేట, శివాయిపల్లి, బూర్గుపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరణ్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ ప్రారంభించారు. ఆర్ఐ ప్రభాకర్, ఏపీఎం గోపాల్, జుకల్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి పేట్, సర్పంచ్ రమేష్, కొత్తపేట సర్పంచ్ అనంతరావు, శివాయిపల్లి సర్పంచ్ […]

Read More
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్​ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్​కార్డులు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట ప్రెస్​క్లబ్​ప్రధాన కార్యదర్శి భాస్కర్​రెడ్డి, ఇతర జర్నలిస్టులు […]

Read More
టీఆర్ఎస్​ప్రభుత్వానికి అండగా ఉందాం

టీఆర్ఎస్ ​ప్రభుత్వానికి అండగా ఉందాం

జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ 50 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ సారథి, వడ్డేపల్లి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం ఆదేశాల మేరకు శుక్రవారం వడ్డేపల్లి తహసీల్దార్ ​ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తహసీల్దార్​ మధుసూదన్​రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, మున్సిపల్ చైర్మన్ కరుణమ్మ 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. రామాపురం, జిల్లేడుదిన్నె, కొవెలదిన్నె, బుడమరసు, జులకల్, గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన రూ.5,105,916 విలువైన చెక్కులను […]

Read More
దుమ్ము రేగుతోంది..

దుమ్ము రేగుతోంది..

వేములవాడ టౌన్​లో మిషన్ ​భగీరథ కోసం తవ్విన రోడ్లు రోడ్లపైనే మట్టి.. వాహనదారులకు ఇబ్బందులు ఇంట్లోకి వస్తున్న దుమ్ము.. ఊపిరిపీల్చుకునేందుకు కష్టం సారథి, వేములవాడ: పేరుకే సిమెంట్​ రోడ్లు.. చూస్తే మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. వేములవాడ పట్టణంలోని మిషన్ భగీరథ పనుల పేరుతో రోడ్లను తవ్వి మట్టిని వదిలేస్తున్నారు కాంట్రాక్టర్లు. మిషన్ భగీరథ పైపు లైన్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పైగా ఈ రోడ్లపై వాహనాలు వెళ్తుంటే దుమ్మ రేగుతోంది. […]

Read More
ఓరి మీ తెలివి ‘‘బంగారం’’ కానూ!

ఓరి మీ తెలివి ‘బంగారం’ కానూ!

బంగారంతో ఏకంగా టీషర్టు మిక్సర్​ గ్రైండర్ లో రెండున్నర కేజీల గోల్డ్ చట్టం నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడుతున్న వైనం సారథి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన దేశానికి తీసుకురావడానికి కొందరు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఒకరు పంటిలో, మరొకరు ఒంటిలో, మరొకరు షూస్​లో అమర్చుకుని తెచ్చిన ఘటనలను చాలా చూశాం.. కానీ వాటికి మించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. బంగారాన్ని రవాణా చేయడానికి ఇన్ని మార్గాలు […]

Read More
కూకట్​ పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?

కూకట్​పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?

హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంలో క్యాష్​ పెడుతుండగా దొంగల కాల్పులు ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం రూ.5లక్షలు దోచుకెళ్లిన దుండగులు సంగారెడ్డిలో నిందితులను పట్టుకున్న పోలీసులు సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడిన దుండగులు పారిపోతూ సంగారెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు. కూకట్​పల్లి పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లో గురువారం డబ్బులు పెట్టేందుకు వెళ్లగా అల్వీన్‌ కాలనీ వైపు నుంచి పల్సర్‌ బైక్ పై వచ్చిన […]

Read More
ఇంట్లో సదుపాయాలు లేని వారికి ఐసొలేషన్​ సెంటర్లు

ఇంట్లో సదుపాయాలు లేని వారికి ఐసొలేషన్​ సెంటర్లు

సారథి, వేములవాడ: కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్ సౌకర్యం లేనివారు తాము ఉండడానికి వీలుగా వేములవాడ పట్టణంలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండొచ్చని ఇన్ చార్జ్ ​జిల్లా వైద్యాధికారి డాక్టర్​శ్రీరాములు తెలిపారు. సరైన సదుపాయం ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, హోం క్వారంటైన్ సదుపాయం లేని వారు ఈ ఐసొలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్​ సెకండ్​ వేడ్​ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, […]

Read More