సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యాలయం చుట్టూ గడ్డి పరిచి అందమైన పూలమొక్కలను నాటారు. ఆడిటోరియం చుట్టూ మొక్కలు నాటారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. నీటి ట్యాంకు, పెద్ద సంప్నిర్మాణం పూర్తయింది. వివిధ అవసరాలకు వచ్చే ప్రజానీకానికి కార్యాలయ ఆవరణలో వెయిటింగ్హాలును ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. భద్రత, […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఈనెల 4న కౌంటింగ్ నిలిచిపోయిన నేరేడ్‌మెట్ లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో టీఆర్ఎస్‌కు 278 ఓట్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా […]