Breaking News

Month: November 2020

హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!

హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!

ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో అలరించిన హెబ్బాపటేల్ ఈసారి డీ గ్లామరస్​క్యారెక్టర్ లో కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో చక్కనైన చీరకట్టుతో పల్లెటూరి మహిళ రాధ పాత్రను పోషించింది. దీపావళి సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. పల్లెటూరులో ఇంటి బయట కూర్చుని చేటలో బియ్యం ఏరుతున్న సాధారణ మహిళగా కనిపిస్తున్న హెబ్బా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ […]

Read More
పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్..​ మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్‌ లవ్‌ స్టోరీని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]

Read More
పెళ్లి రోజు.. క్వార్టర్​ మద్యం పంపిణీ!

పెళ్లి రోజు.. రూపాయికే క్వార్టర్​ మందు!

సారథి న్యూస్, మానవపాడు: సినీ హీరోలు, దర్శకులపై అభిమానులకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. సాధారణంగా పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు, వస్ర్తాలను పంపిణీ చేయడం పరిపాటి. అయితే ఓ సినీ డైరెక్టర్​ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాన్స్​ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రూపాయికే క్వార్టర్ మద్యం అందజేసి.. అన్నదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. సినీ డైరెక్టర్ ​ఎన్.శంకర్ పెళ్లిరోజు వేడుకను అభిమానులు ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో […]

Read More
బారడీ పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

బారడీ పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో నూతనంగా నిర్మించిన బారడీ పోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం విగ్రహాన్ని ప్రతిష్టించి నైవేద్యం పెట్టి, సాయంత్రం బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎడ్ల బండ్లను ముస్తాబుచేసి ఊరేగింపుగా ఊరు శివారులో ఉన్న బారడీ పోచమ్మ మందిరం వరకు తీసుకెళ్లి ప్రదక్షిణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు తరలొచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

Read More
సీఎం కేసీఆర్​కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం

సారథి న్యూస్, హైదరాబాద్​: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్య. కళాకారుడు గోరటి వెంకన్న, దయానంద్ గుప్తాకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఆ ముగ్గురు పేర్లను శుక్రవారం జరిగిన కేబినెట్ ​సమావేశంలో వెల్లడించారు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్న నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లు ఎంపిక చేశారు. దివంగత మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీకాలం ముగియనుండడంతో పై ముగ్గురికి […]

Read More
చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్​.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్​కు తీసుకెళ్లారు.

Read More
తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి

తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాలని మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆకాంక్షించారు. సనత్ నగర్ లో సుమారు రూ.ఐదుకోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండు బ్యాడ్మింటన్ ​కోర్టులు, లేడీస్ జిమ్, టేబుల్ టెన్నిస్, యోగా సెంటర్, క్యారమ్స్ ఆడేందుకు సదుపాయాలు కల్పించారు. అలాగే సనత్ నగర్ నెహ్రూ పార్కులో థిమ్ పార్కు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ​శంకుస్థాపన చేశారు. […]

Read More
సన్నవడ్లను కొంటాం

సన్న వడ్లను కొంటాం

సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.40 లక్షలు సొంత ఖర్చులతో తన దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం రైతుల కోసం నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న ఒడ్లను కొంటామని స్పష్టంచేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని సొంతం రాష్ట్రం […]

Read More