Breaking News

Month: October 2020

మెదక్​కలెక్టర్​గా ఎం.హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

మెదక్​ కలెక్టర్​గా ఎం.హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ ​జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో కృషిచేస్తానని కలెక్టర్​ఎం.హనుమంతరావు ప్రకటించారు. సోమవారం మెదక్ ​జిల్లా కలెక్టర్​గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏడుపాయలలో ఆలయ ఈవో శ్రీనివాస్​కలెక్టర్​కు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గామాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వనదుర్గామాత అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని.. జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించే ముందు దుర్గామాతను […]

Read More
ఇళ్లు కట్టి చూపించాం

ఇళ్లు కట్టి చూపించాం

సారథి న్యూస్, హైదరాబాద్: జియాగూడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్​ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేను కట్టిస్తా. పెండ్లి నేను చేస్తా అన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే’ అని సృష్టంచేశారు. డబుల్ […]

Read More
కొట్రలో దసరా మహోత్సవం

కొట్రలో దసరా మహోత్సవం

సారథి న్యూస్, వెల్దండ: విజయదశమి మహోత్సవాన్ని నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. చుట్టాలు, బంధువులు, కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం జమ్మిచెట్టు వద్దకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయుధపూజ నిర్వహించారు. శమీ మంత్రం జపించారు. ఈ యేడు తమకు కాలం ఎలా కలిసొస్తుందో.. ఆదాయ వ్యయాలను సరిచూసుకున్నారు. అనంతరం జమ్మి ఆకులు తెంచి.. […]

Read More
ఆంధ్రప్రదేశ్ లో లంబోర్గిని కార్ల యూనిట్​

ఏపీలో లంబోర్గిని కార్ల యూనిట్​

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక వాహనాల తయారీ యూనిట్‌ రానుంది. ప్రముఖ స్పోర్ట్స్‌ వెహికల్‌ బ్రాండ్‌ లంబోర్గిని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. గోల్ఫ్, ఇతర క్రీడల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, […]

Read More
దేవరగట్టు సమరానికి బ్రేక్​

దేవరగట్టు సమరానికి బ్రేక్​

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్‌ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవంపై నిషేధం విధించినట్లు పోలీసులు ప్రకటించారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో ఫైట్​ చేస్తుంటారు. సంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు. చేతులు విరగ్గొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతో మంది […]

Read More
మట్టిమిద్దె కూలి ఐదుగురు మహిళల దుర్మరణం

మట్టిమిద్దె కూలి ఐదుగురు మహిళల దుర్మరణం

సారథి న్యూస్​, వనపర్తి: మట్టిఇంటి మిద్దె కూలి ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం బుద్దారంలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం బుద్దారంలో విషాదఘటన జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన సంవత్సరీకం కోసం కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు గ్రామానికొచ్చారు. కార్యక్రమం ముగిసింది. ఉక్కపోతకు ఫ్యాన్ ఉందని 11మంది ఒకే గదిలో నిద్రపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా నానిపోయి […]

Read More
దేదీప్యమానంగా తెప్పోత్సవం

దేదీప్యమానంగా తెప్పోత్సవం

సారథి న్యూస్, మానవపాడు(అలంపూర్): తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా తెప్పోత్సవం జరిగింది. ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆదిదంపతుల(స్వామి, అమ్మవారు) తెప్పోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించగా.. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘జై జోగుళాంబ, జై బాలబ్రహ్మేశ్వరా!’ అంటూ భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయాల నుంచి ఊరేగింపుగా పల్లకీలో నది వద్దకు తీసుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో […]

Read More
నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!

నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!

సారథి న్యూస్, పాల్వంచ: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం దసరా పండగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. మంచి నీళ్లు ఇప్పించండి మహాప్రభో.. అని ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. ‘చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ భగీరథ నీళ్లు వస్తున్నాయి. కానీ తమ ఊరుకు మాత్రం రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు! ఎమ్మెల్యే గారు! మీరైనా మా బాధలను అర్థం […]

Read More