Breaking News

Day: October 9, 2020

రాజస్తాన్​ మరోసారి..!

రాజస్తాన్​ మరోసారి..!

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్‌ చతికిలపడింది. రాజస్తాన్‌ బ్యాట్స్​మెన్లు యశస్వి జైస్వాల్‌ 34(36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ 24(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ 13(8 బంతుల్లో 2 ఫోర్లు), రాహుల్​తెవాటియా 38(29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) […]

Read More
ఎర్రోళ్ల రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి

ఎర్రోళ్ల రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, జడ్చర్ల: కర్వెన రిజర్వాయర్ ఓపెనింగ్ కు ఊర్కొండ మండలం జగబోయిన్​పల్లి సర్పంచ్ పిలుపు మేరకు ర్యాలీకి వెళ్లి ట్రాక్టర్​ బోల్తాపడి మృతి చెందిన ఎర్రోళ్ల రాజు కుటుంబానికి ఆదుకోవాలని జై భీమ్ యూత్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జంతుక శంకర్ డిమాండ్​ చేశారు. ప్రమాద జరిగిన స్థలంలో టీఆర్ఎస్​ నాయకులు కనీసం పట్టించుకోలేదన్నారు. ఏడునెలల క్రితమే రాజుకు వివాహమైందని, తన భార్య ఏడునెలల గర్భిణిగా ఉందన్నారు. ఈ ఘటనకు జడ్చర్ల ఎమ్మెల్యే నైతిక బాధ్యత […]

Read More
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ప్ ద్వారా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఆర్థిక స్తోమత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వపరంగా పరిశ్రమల స్థాపనకు సహకరించాలన్నారు. జనాభాపరంగా అన్ని సామాజికవర్గాలకు లబ్ధి చేకూరాలన్నారు. టీ-ప్రైడ్ పథకం ద్వారా 8 దరఖాస్తులు రాగా, ఏడింటిని పరిశీలించి […]

Read More
దసరా కానుకగా తీరొక్క చీరలు

దసరా కానుకగా తీరొక్క చీరలు

సారథి న్యూస్, ములుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఏడాది మంచి డిజైన్లు, నాణ్యత పరంగా మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది 287 డిజైన్లతో చీరలను తయారు చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో 85వేల మంది, రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అమ్మవార్లు […]

Read More
కరోనా పీడ తొలగిపోవాలి

కరోనా పీడ తొలగిపోవాలి

సారథి న్యూస్, రామగుండం: నియోజకవర్గంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు,కార్మికులు, కర్షకులు, అన్నివర్గాల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనిఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవిని వేడుకున్నారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Read More
ఇంటింటా బతుకమ్మ జరుపుకోవాలి

ఇంటింటా సంతోషంగా నిండాలని..

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్‌ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]

Read More
14న రాష్ట్రవ్యాప్తంగా నిరహార దీక్షలు

14న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు

ఏఐకేఎస్‌సీసీ పిలుపు సారథి న్యూస్​, హైదరాబాద్​: అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో అక్టోబర్‌ 14న కనీస మద్దతు ధరల హక్కుదినాన్ని జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలోని భాగస్వామ్య సంఘాలతో పాటు రైతు మద్దతుదారులంతా భాగస్వాములు కావాలని టి.సాగర్‌, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్‌, పల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ […]

Read More
యాసంగిలో ఏ పంటలు వేద్దాం

యాసంగిలో ఏయే పంటలు వేద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? […]

Read More